Political News

వంగవీటి రాధాకు కొడాలి నాని బంపర్ ఆఫర్


వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. పార్టీలు వేరైనా వారి స్నేహానికి ఆ పార్టీలు అడ్డురాలేదు. ఏ చిన్న కార్యక్రమైనా ఆ నేతలు చెట్టాపట్టాలేసుకుని ఆ ఫంక్షన్‌లో సందడి చేసేవారు. స్నేహం ఇలా ఉండాలనే వారిద్దనీ చూసిన వారు ముచ్చటపడేవారు. స్నేహానికి చిహ్నంగా ఉన్న వారి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. వారి మధ్య చిక్కుకు కారణం ఇప్పటికీ ఎవరికీ అంతుతెలియని ప్రశ్న. ఇప్పుడు ఇద్దరూ ఓకే వేదికపై కొలువుతీరబోతున్నారు. ఇంకేముందు సన్నిహితులకు కార్యకర్తలకు పండగే. ఇద్దరు ఎవరో కాదు ఒకరు మంత్రి కొడాలి నాని, మరోకరు వంగవీటి రాధాకృష్ణ. ఏపీ రాజకీయాల్లో వీరిని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అంత పాపులర్ నేతలు వీళ్లు.

కొడాలి నాని చొరవతో తిరిగి రాధా వైసీపీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కలయికకు గుడివాడ వేదిక అయిందట. గుడివాడ వైసీపీ నేత పాలేటి సుబ్రహ్మణం, మనవడి పుట్టిన రోజు వేడుకల్లో నాని, రాధా కలుసుకున్నారు. ఒకరి ఒకరు చూసుకుని భావోద్వేగానికి గురయ్యారని పుట్టిన రోజు వేడకల్లో పాల్గొన్నావారు చెబుతున్నారు. నాని ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో కీలకమైన మంత్రిగా పనిచేస్తున్నారు. స్నేహితుడు రాధా కూడా మంచి ఫోజిషన్ చూసుకోవాలని మంత్రి ముచ్చటపడుతున్నారని చెబుతున్నారు. అందుకోసం రాధాను వైసీపీలో చేరమని ఆహ్వానించారు. అంతేకాదండోయ్ రాధాకు మంత్రిగారు ఓ బంఫర్ ఆఫర్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వస్తే జగన్‌తో మాట్లాడి ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేస్తానని ఆఫర్ ఇచ్చారని రాధా సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రతిపాధనకు ఒప్పుకోవాలని రాధా సన్నిహితులు ఆయనపై ఒత్తడి చేస్తున్నారని తెలుస్తోంది.

విజయవాడ, కృష్ణా జిల్లాలో వంగవీటి రాధా తండ్రి రంగాపై చరగని అభిమానం ఉంది. ఆయన వారుసుడిగా రాధాను కూడా అభిమానులు ఆశీర్వదించారు. 2009లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాధా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జగన్ సొంతంగా పార్టీ ఏర్పాటుతో ఆయనకు రాధా మద్దతుగా నిలిచి. వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు అభ్యర్దిగా పోటీ చేసినా మరో సారి ఓటమి తప్పలేదు. టీడీపీ అభ్యర్ది గద్దే రామ్మోహన్ ఆ ఎన్నికల్లో రాధాపై గెలుపొందారు. తరువాత కొంత కాలం వైసీపీలోనే రాధా కొనసాగారు. తరువాత కొంత కాలం వైసీపీలోనే రాధా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇంతలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఇక రాధా, జనసేనలో చేరుతారని అందరూ అనుకున్నారు. అయితే ఆ పార్టీలో కూడా చేరలేదు.

ఇటీవల గుడివాడ కేంద్రంగా రాధా రాజకీయం చేస్తున్నారనే ప్రచారం జోరరందుకుంది. గుడివాడలో రాధా తరచూ పర్యటనలు చేస్తున్నారు. కాపు సామాజికవర్గ నేతలతో భేటీలు అవుతున్నారు. ఏ చిన్న కార్యకమమైనా హాజరవుతున్నారని చెబుతున్నారు. ఇటీవల నాని తీరుపై గుడివాడ కాపు సామాజికవర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు రాధా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాధా.. గుడివాడ పర్యటనల వెనుక వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే బరిలోకి దిగేందుకు ఇప్పటి నుంచి సన్నాహాకాలు చేస్తున్నారనే గుడివాడ వాసులు చెబుతున్నారు. రాధా తనకు పోటీ రాకుండా ఉండేందుకు ఆయనకు నాని, ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిమైనా ఆ స్నేహితులు కలకలంగా స్నేహంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

This post was last modified on September 27, 2021 6:13 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

6 mins ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

9 mins ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

20 mins ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

1 hour ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

2 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

3 hours ago