ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని టీఆర్ ఎస్ సర్కారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇస్తున్న సంకేతాలు ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నాయి? ఇలా చేయ డం ద్వారా.. బీజేపీకి అనుకూలమనా?. లేక వ్యతిరేకమనా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం జరుగుతున్న భారత్ బంద్ విషయంలో ఏపీ, తెలం గాణ ప్రభుత్వాలు భిన్నమైన మార్గాలను ఎంచుకోవడమే.
నూతన సాగు చట్టాలు, కేంద్రం తీసుకువచ్చిన నూతన కార్మిక విధానాలు, కార్పొరేటీకరణ, కేంద్ర ఆస్తుల విక్రయాలు వంటి అంశాలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు.. వివిధ ప్రజా సంఘాలు.. బంద్ కు పిలుపు నిచ్చాయి. ఇది పూర్తిగా కేంద్రంలోని నేరేంద్ర మోడీ సర్కారుపై చేస్తున్న యుద్ధంగా ప్రతిపక్షా లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పాలితరాష్ట్రాలు.. బీజేపీ అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలు దూరం గా ఉన్నాయి. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి భిన్నంగా ఉంది.
గతంలో ఒకసారి కూడా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మద్దతిచ్చింది. స్వయంగా మంత్రి కేటీఆర్.. ఈ బంద్‌లో తాము కూడా పార్టిసిపేషన్ చేస్తున్నట్టు ప్రకటిం చారు. బస్సులు, ఇతర వాణిజ్య సంస్థలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మాత్రం తెలంగాణ సర్కారు బంద్ కు దూరంగా ఉంది. తొలి సారి బంద్ జరిగి ఆరు మాసాలు కూడా కాలే దు. సో.. అప్పట్లో ఈ బంద్‌కు ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అనూహ్యంగా దూరంగా ఉండ డం అనేక ప్రశ్నలకు అవకాశం ఇచ్చింది.
కేంద్రంలోని పెద్దలతో కేసీఆర్ సర్కారుకు ఏదైనా ఒప్పందం జరిగిందా? రాష్ట్రానికి సంపూర్ణంగా సహ కరించేందుకు కేంద్ర పెద్దలు ఓకేచెప్పారా? అందుకే ఆయన బంద్‌కుదూరంగా ఉన్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక, ఈ బంద్ విషయంలో ఇతర పక్షాలుచేస్తున్న ఆందోళనను కూడా కేసీఆర్ సర్కారు అణిచి వేస్తుండడం గమనార్హం. ఇప్పటికే వామపక్షాలు, టీడీపీకి చెందిన పలువురిని అరెస్టులు చేశారు. సో.. మొత్తానికి ఆరు మాసాల్లోనే.. కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు.
ఇక, ఏపీ విషయాన్ని గమనిస్తే.. గతంలో నిర్వహించిన బంద్‌కు , ఇప్పుడు చేస్తున్న బంద్‌కు కూడా జగన్ సర్కారు మద్దతిస్తోంది. దీనిపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వానికి సహకారం అందకపోవడం వల్లే ఇలా చేస్తున్నారా? లేక.. రైతుప్రభుత్వమని చెప్పుకొనే తమ కు.. రైతుల నుంచి సెగతగల కుండా ఉండేలా చూసుకునేందుకు ఇలా చేస్తున్నారా? అనేది చర్చగా మారింది. మరోవైపు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కేంద్రం పెద్దలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. బీజేపీ విషయంలో కేసీఆర్.. అనుసరిస్తున్న వైఖరి వెనుక వ్యూహం ఉందనే ఆలోచన వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 27, 2021 4:21 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…