ఏపీ సీఎం జగన్ వ్యూహం బెడిసి కొడుతుందా ? ఆయన తీసుకునే నిర్ణయం.. పార్టీపై ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తుందా ? పాలన మందగిస్తుందా ? అంటే.. అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2019లో అధికార పగ్గాలు చేపడుతూనే.. సీఎం జగన్ తన మంత్రి వర్గంలో 90 శాతం మారుస్తానంటూ.. ప్రకటించారు. అయితే.. అప్పటికే సోషల్ ఇంజనీరింగ్‌ను పాటించిన నేపథ్యంలో బాగానే ఉంటుందని.. పార్టీలోనూ అసంతృప్తులు తగ్గుతాయని ఆయన భావించి ఉండొచ్చు. కానీ, ఇప్పటికి రెండున్నరేళ్లు.. గడుస్తున్నా.. పాలనపై పట్టు ఇప్పుడున్న మంత్రులకు దక్కలేదనేది వాస్తవం. అనేక శాఖల్లో ఇంకా అధికారులపైనే ఆధారపడి మంత్రులు చక్రం తిప్పుతున్నారు. దీనివల్ల అభివృద్ధి మందగించింది.
ఇది.. పార్టీపై ఎలా ఉన్నప్పటికీ.. జగన్ పాలనపై మాత్రం వ్యతిరేకత పెంచుతుందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే రెండున్నరేళ్లు కూడా అత్యంత కీలకం. ప్రజలకు నిధులు ఇచ్చినా.. సంక్షేమాన్ని అమలు చేసినా.. శాఖలపై పట్టుతో మంత్రులు పుంజుకుని.. అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన కీలక సమయం. ఈ రెండున్నరేళ్లలో పాలన పక్కదారి పడితే.. ఖచ్చితంగా.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. గతంలో చంద్రబాబు హయాంలోనూ చివరి ఏడాదిన్నర.. కేంద్రం నుంచి సహకారం లోపించడం.. మంత్రులపై ఆరోపణలు రావడం.. చంద్రబాబు కేంద్రంపై పోరు బాట పట్టడం.. వంటివి అప్పటి వరకు ఉన్న పాజిటివిటీని నెగిటివ్‌గా మార్చాయి. ఫలితంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ఆయన విజయం దక్కించుకోలేక పోయారు.
అలాగని.. మార్చకూడదని.. మార్పు ఉండకూడదని ఎవరూ అనడంలేదు. అయితే.. కీలక శాఖలైన ఆర్థిక, పట్టణ, గ్రామీణ, రెవెన్యూ, పెట్టుబడులు, పరిశ్రమలు.. ఇలా కొన్ని శాఖల విషయంలో పట్టు విడుపులు అత్యంత కీలకమని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ అందరినీ గుండుగుత్తుగా మార్చేస్తే.. ఆయా శాఖలపై కొత్తగా వచ్చే మంత్రులు పట్టు సాధించే సరికే పుణ్యకాలం గడిచిపోయి.. ఎన్నికల నామ సంవత్సరం వచ్చేస్తే.. పార్టీ ఎలా ఉన్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి.. మొత్తానికే కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.
కీలకమైన శాఖలను మార్పు చేయకుండా.. కొన్ని శాఖలపై పట్టు పెంచుకున్న మంత్రులను కొనసాగించడం ద్వారా.. సీనియర్లను వదులు కోకుండా చూడడం ద్వారా.. మార్పు చేసి పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆర్థిక మంత్రి బుగ్గనను మార్చేస్తే.. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే స్థాయికి నూతన మంత్రి ఎప్పటికి చేరుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. ఇలా.. మొత్తంగా చూస్తే.. సంపూర్ణ మార్పు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on September 27, 2021 7:15 am
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…