ఆ ఇద్దరు యువ నాయకులు ఏపీ సీఎం జగన్‌కు తలనొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జగన్‌ను ఇబ్బంది పెడుతున్నాయా? కీలకమైన జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి.. ఈ ఇద్దరు నేతలే కారణమని.. సీఎంకు సమాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ! తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. గత 2019 ఎన్నికల్లో జగన్ సునామీ వీచినా.. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బలమైన కేడర్.. ఓటు బ్యాంకు రెండూ ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక్కడి నేతలు సమర్ధవంతంగా.. కలిసిమెలిసి పనిచేయాలని.. జగన్ తరచుగా చెబుతున్నారు.
ఈ క్రమంలో కొందరు నాయకులు కలిసి మెలిసి పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం.. తరచుగా వివాదాలకు దిగుతున్నారు. సవాళ్లు రువ్వుకుంటున్నారు. అంతేకాదు.. సీఎం జగన్ దగ్గర నాకే పలుకుబడి ఉంది.. నువ్వు బచ్చా! అంటూ..పరుష పదజాలంతో కామెంట్లు చేసుకుంటున్నారు. ఇది.. వైసీపీకి డ్యామేజీ చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వరంగా మారింది. రాజమండ్రి నుంచి గెలిచిన మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల పరిస్థితి పార్టీని తీవ్ర సంకటంలోకి నెట్టింది. సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఈ నాయకులు.. ఒకరిపపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఇసుక అక్రమాలు.. అంటూ.. సొంత పార్టీ నేతలపై ఎంపీ పోరు బాట పట్టారు.
ఇక, అప్పటి నుంచి ఎమ్మెల్యే రాజా దూకుడు పెంచారు. దీంతో వీరి మధ్య వివాదాలు.. తాజాగా జరిగిన ఓ ఉపాధ్యాయుడిపై దాడిఘటన మరింత పెంచింది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం మరింత తారస్థాయికి చేరింది. ఇరువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా పరుష పదజాలంతో దూషించుకున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే.. మున్ముందు కష్టమని.. పార్టీ కీలక సలహాదారు నుంచి సందేశం వెళ్లిందని తూర్పులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ఉండాలంటే.. పార్టీ విధానాలను గౌరవించాలని.. రోడ్డున పడికొట్టుకోవడం సరికాదని.. పార్టీ అధిష్టానం నుంచి సందేశం వచ్చినట్టు సదరు నాయకుల అనుచరులు గుసగుసలాడుతున్నారు. మరోవైపు.. వీరి వ్యవహార శైలిని టీడీపీ మరింతగా ప్రచారం చేస్తుండడం పార్టీకి డ్యామేజీగా మారింది. మరివీరు మారతారో.. లేక జగనే వీరిని మారుస్తారో ? చూడాలి.
This post was last modified on October 3, 2021 10:19 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…