తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రాజమండ్రి ఎంపీ స్థానం విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సీటును ఎవరికి కేటాయిస్తారు? ఎవరు ఇక్కడ పాగా వేస్తారు? అనేది సీనియర్ల మధ్య చర్చగా మారింది. దీనికి కారణం.. వరుసగా ఇక్కడ నుంచి పోటీ చేసిన సీని నటుడు.. సీనియర్ నాయకుడు.. మాగంటి మురళీ మోహన్ ఇక్కడ నుంచి తప్పుకోవడమే. అనారోగ్య కారణాలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు.. అసలు రాజకీయాల నుంచి కూడా ఆయన తప్పుకొంటున్నట్టు కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ సీటు ఖాళీగా ఉంది.
2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగంటి .. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మాత్రం విజయం దక్కించుకున్నారు. అయితే.. మధ్యలోనే ఆయన అనారోగ్యం పాలవడంతో ఆయన కోడలు.. రూపాదేవి ఇక్కడ చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో చంద్రబాబు ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె వైసీపీ దూకుడు ముందు విజయం దక్కించుకోలేక పోయారు. ఆ తర్వాత.. కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ, ఎందుకో.. పార్టీలో నేతల నుంచి సరైన మద్దతు లభించలేదనే కారణంగా.. మురళీ మోహన్.. పూర్తిగా రాజకీయాల నుంచి తాను తప్పుకొని.. తన కోడలును కూడా వ్యాపారాలకే పరిమితం చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు.. కేఎస్ జవహర్‌ను నియమించారు. అయితే..ఈయనకు ఎంపీగా పోటీ చేసే స్థాయి లేదు. ఈయన పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కడం కష్టమే. ఈ నేపథ్యంలో కొత్తవారికి లేదా.. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్‌కు ఈ టికెట్‌ను కేటాయించాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు దీనిపై క్లారిటీలేదు. రాజమండ్రి ఎంపీ విషయానికి వస్తే.. రాజకీయంగా.. ఇప్పుడు తీవ్రమైన ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి.
టీడీపీ గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. అయితే.. ఈ పార్లమెంటు పరిధిలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సైకిల్ చతికిల పడింది. ఇప్పుడు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక, సిటీ ఎమ్మెల్యే ఆది రెడ్డి భవానీ.. యాక్టివ్‌గా ఉండడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. టీడీపీ మాజీలు దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ స్థానం ఎవరు కైవసం చేసుకున్నా.. తీవ్రంగా శ్రమించాలని పార్టీలోనే గుస గుస వినిపిస్తోంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇదే టాక్ వినిపిస్తోంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. మరోవైపు.. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ దూకుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి టీడీపీ పుంజుకునే ప్రయత్నం చేయాలనేది సీనియర్ల వాదన. కానీ, దీనిపై అధిష్టానం నుంచి క్లారిటీ లేక పోవడంతో సీనియర్లు ఎవరిని నియమిస్తారనే చర్చ జోరుగా చేస్తున్నారు. మరి ఎవరికి ఈ సీటు దక్కుతుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 10:36 am
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…
కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క దర్శనం జరిగి ఏడాదికి పైగానే అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్లలో స్వీటీ…
ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో…