ఏపీ ప్రభుత్వంపై తరచుగా.. విమర్శలు గుప్పించే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీతో చేతులు కలిపిన తర్వాత.. విమర్శలు తగ్గించారు. అడపా దడపా మాత్రమే చిన్న పాటి కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ట్విట్టర్ వేదిగా .. ఓ రేంజ్‌లో ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న చిన్న పదాలతో ఏపీ సర్కారు వైఖరిని ఆయన ఎండగట్టారు. ఎక్కడా భారీ విమర్శలు గుప్పించలేదు. కానీ.. పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఏపీని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రాను అమ్మేస్తున్నారని.. దుయ్యబట్టారు.
కేవలం చిన్న స్లైడ్‌పై చిన్న చిన్న వ్యాఖ్యలతో చాలా తీవ్రంగా నిప్పులు చెరిగారు. అబద్ధాలు.. అబద్ధాలు, రాజకీయకక్షలు, ప్రజాధనం దుర్వినియోగం, మరో వెనిజులా, ఇసుక అక్రమ తొవ్వకాలు.. అంటూ.. పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, రాష్ట్రంలో ప్రభుత్వం అమ్ముతున్న మద్యం పైనా చమ్మక్కులు పేల్చారు. ‘బూమ్ బూమ్’ ప్రెసిడెంట్ మెడల్ పేరుతో మద్యం అమ్మకాలను ఆయన ప్రశ్నించారు. యువతను గాలికి వదిలేశారని.. దళితులపై దాడులు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. గ్రూప్ 1, 2లకు కలిపి .. కేవలం 36 పోస్టులే ప్రకటించారని పేర్కొన్నారు. యువతను జగన్ మోసం చేశారు అని వ్యాఖ్య చేశారు.
ఇక, ఏపీని రక్షించాలని కామెంట్ చేశారు. మటన్ షాపులు, సినిమా టికెట్లు, టాయిలెట్లపై పన్ను వంటి వాటిని పవన్ పేర్కొన్నారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షణ కరువైందని పేర్కొన్నారు. 18000 లిక్కర్ మాఫియా, నేరాలు 68 శాతం పెరిగిపోయాయని పేర్కొన్నారు. అప్పుల ప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. కరెంటు చార్జీలు పెంచేశారు. తొండంగిని కాపాడాలి.. ఇలా.. అనేక విషయాలను పవన్ ప్రస్తావిస్తూ.. ఎలాంటి ఘాటు విమర్శలు సంచలన కామెంట్లు లేకుండా.. ఉన్నది ఉన్నట్టు ఉతికి ఆరేశారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఇది భారీ ఎత్తున ట్రోల్ అవుతుండడం విశేషం.
This post was last modified on September 23, 2021 9:36 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…