కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి చాలా సైలెంట్ గా తనపనేదో తాను చేసుకునెళిపోతున్నారు. తెలంగాణా చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కేసీయార్ పై రేవంత్ పెద్ద యుద్ధమే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతమంది సీనియర్లు తనతో కలిసొస్తారనే విషయాన్ని పక్కనపెట్టేసి తనతో కలిసొచ్చే నేతలతోనే యుద్ధాన్ని ప్రారంభించేశారు. ఇదే సమయంలో తనంటే వ్యతిరేకంగా ఉండే సీనియర్లను నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మద్దతు ఇవ్వాలని రిక్వెస్టు చేస్తున్నారు.
సొంతపార్టీ నేతల మద్దతును పక్కన పెట్టేస్తే ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు రెడీ అయిపోయారు. ఇందులో ఓ విధంగా సక్సెస్ సాధించినట్లే అనుకోవాలి. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయాలని రేవంత్ ఈమధ్యనే పిలుపిచ్చారు. ఇందులో భాంగానే వాయపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలకు కూడా ఆహ్వనాలన పంపారు. రేవంత్ ఆహ్వానాన్ని అందుకున్న పార్టీల్లో సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐ ఎంఎల్, తెలంగాణా ఇంటిపార్టీ, పీవైఎల్, పీడీఎస్యూ లాంటి విద్యార్ధి విభాగం కూడా సానుకూలంగా స్పందించింది.
రేవంత్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో జరిగిన సమావేశానికి పై పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. కేసీయార్ ప్రభుత్వంపై ఉమ్మడిపోరాటాలు చేయాలని డిసైడ్ చేశారు. వామపక్షాలకు ఉన్న ఓటుబ్యాంకు ఎంత, వామపక్షాల భావజాలం ఉన్న ఇతర పార్టీల బలమెంత అన్నది పక్కన పెట్టేస్తే ఐదారు పార్టీల అధినేతలతో మాట్లాడి ఐక్యపోరాటాలకు వాళ్ళని ఒప్పించటమే రేవంత్ సాధించిన విజయం.
ప్రస్తుతం వామపక్షాల బలం క్షీణించిపోతోందన్నది వాస్తవం. అయితే వీళ్ళు ఒంటరిగా పోటీచేసి గెలవలేకపోయినా ఎన్నికల ఫలితాలను ప్రభావం చూపగలరన్నది వాస్తవం. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వామపక్షాలు, సీపీఐఎంఎల్ బలంగా ఉన్నాయి. వీటికున్న ఓటుబ్యాంకుతో గెలుపోటములను కచ్చితంగా డిసైడ్ చేయగలవు. ఇలాంటి పార్టీలు రేపటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తే హస్తంపార్టీకి మెరుగైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏమిటంటే కేసీయార్ కోవర్టులే అని ఇప్పటికే బలమైన ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటు కేసీయార్ కు అనుకూలంగా పనిచేస్తున్నారంటు కొంతమంది సీనియర్ నేతలపై ఆరోపణలున్నాయి. అందుకనే కేసీయార్ కోవర్టులందరు స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవాలంటు రేవంత్ రెడ్డి ఆమధ్య ఇచ్చిన పిలుపు సంచలనమైంది. పార్టీని కోవర్టుల నుండి రేవంత్ రక్షించుకోగలిగితే ఇతర పార్టీల పొత్తుతో ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలే వస్తాయని అనుంటున్నారు. మరి ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on September 21, 2021 12:04 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…