అమెరికా నిష్క్రమణ, తాలిబన్ల దురాక్రమణ తర్వాత ఆప్ఘనిస్ధాన్లోని ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలుసా ? జనాల బతుకులు దుర్భరమైయాయి. దేశంలోని కోట్లాది మంది ప్రజలు మూడు పూటల కడుపునిండా తిండి తిని ఎన్నో రోజులైందట. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల ఆకలిని తీర్చటానికి యజమానులు, ఇంటి పెద్దలు ఇంట్లోని విలువైన వస్తువులను అమ్మేసుకుంటున్నారు. తమ వస్తువులకు ఎంత ధర వస్తే అంతే చాలన్న ఆత్రంతా ఇంట్లోని వస్తువులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తున్నారు.
రాజధాని కాబూల్ లో జనాల పరిస్థితి ఎలాగుందో దేశంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపు ఒకేలాగుంది. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫా సెట్లు, బీరువాలు, కార్లు, మోటార్ బైకులు ఒకటేమిటి కొనేవారుంటే అన్నింటినీ అమ్మేసుకుంటున్నారు. ఈ మధ్యనే రు. 25 వేలు పెట్టి కొనుగోలు చేసిన పెద్ద రిఫ్రిజిరేటర్ ను లాల్ గుల్ అనే వ్యాపారి కేవలం రు. 5 వేలకే అమ్మేశాడు.
ఎందుకంటే కుటుంబ సభ్యులకు భోజనం పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవట. మూడు పూటల భోజనం చేసి కనీసం వారం రోజులైందని లాల్ గుల్ చేప్పటం చూస్తుంటే ఎంతటి దుర్భర పరిస్ధితులు రాజ్యమేలుతున్నాయో అర్ధమైపోతోంది. తొందరలోనే దేశంలోని జనాభాలో కనీసం 2 కోట్లమందికి తినటానికి తిండి కూడా దొరకదని 15 రోజుల క్రితమే ఐక్యరాజ్యసమితి నిపుణులు ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రెండు వారాల క్రితం నిపుణుల అంచనాలే ఇపుడు నిజాలయ్యాయి.
కాబూల్ లోని ఏ ప్రాంతంలో చూసినా ఇళ్ళముందు వస్తువులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే అన్నింటినీ అమ్మకానికి పెట్టేశారు కాబట్టి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే దాదాపు అందరి ఇళ్ళల్లోని పరిస్థితి ఒకేలాగుండటం, అందరు కూడా తమ ఇళ్ళల్లోని వస్తువులను అమ్మకానికి పెట్టేయటంతో కొనేవాళ్ళు కనబడటంలేదు. దాంతో డిమాండ్ పడిపోయి సప్లై విపరీతంగా పెరిగిపోయింది. అందుకనే లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కొత్త సోఫాసెట్టును కేవలం రు. 10 వేలకు అమ్ముకున్నట్లు ఓ ఇంటి యజమాని చెప్పారు.
ఆప్ఘన్ను తాలిబన్లు ఆక్రమించుకుని దాదాపు నెల దాటింది. అప్పటినుండి పరిస్థితులు రోజు రోజుకు దరిద్రంగా తయారవుతోంది. ఆర్థిక సంక్షోభంలో యావత్ దేశం కూరుకుపోయింది. ఓ మాదిరి ధనిక కుటుంబం కూడా కిలో బంగాళదుంపలు కొని చాలా రోజులైందట. ఎందుకంటే కిలో బంగాళదుంపలు మన కరెన్సీలో సుమారు 3 వేల రూపాయలట. బయట నుండి ఆహారం దిగుమతులు ఆగిపోయాయి. బ్యాంకులు కూడా సరిగా పనిచేయటం లేదు. ఉన్న డబ్బంతా తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. దాంతో ఏమి చేయాలో జనాలకు అర్థం కావటం లేదు.
This post was last modified on %s = human-readable time difference 2:55 pm
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…