మెగా బ్రదర్ నాగబాబు దూకుడు ఎంతమాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారి తీస్తున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. అగ్రెసివ్ కామెంట్లతో దూసుకెళ్లిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ చర్చలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. బాలయ్య, తెలుగుదేశం అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
నాగబాబును బూతులు తిడుతూ టీడీపీ ఫ్యాన్స్ వీడియోలు పెట్టారు. దీనికి బదులుగా నాగబాబు శుక్రవారం రాత్రి ఒక కుక్క ఫొటో పెట్టి.. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసే ప్రమాదకర సీజన్ ఇప్పుడు నడుస్తోందని.. వాటిని నియంత్రించకపోతే చాలా ప్రమాదమని పరోక్షంగా తనను తిడుతున్న వారిని కౌంటర్ చేసే ప్రయత్నం చేశాడు.
ఇక శనివారం నాగబాబు తెలుగుదేశం అభిమానుల్ని డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోదని ఆయన తీర్మానించేశారు. మళ్లీ అధికారం దక్కుతుందనుకుంటే అది ఒక భ్రాంతే అని నాగబాబు అన్నారు.
‘‘ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో, జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీ లేదు. అభివృద్ధి అంతా టీవీల్లో పేపర్లలో తప్ప .. నిజంగా చేసింది చాలా తక్కువ. గ్రౌండ్లో కనిపించింది తక్కువ. అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ.. అబ్బో ఇంకా చాలవున్నాయి. ఈ ట్విట్టర్ ఏం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక తర్వాత మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి ఇల్యూషన్స్ లోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే దే ఆర్ వెల్కమ్. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని హ్యాలూజినేషన్స్ అంటారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాలూజినేషన్స్’’ అని నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
This post was last modified on May 30, 2020 5:03 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…