Political News

అమ్మకానికి రైలు బోగీలు…అద్దెకైనా పర్వాలేదట

నరేంద్ర మోడీ సర్కార్ ప్రైవేటీకరణలో చాలా స్పీడు పెంచుతోంది. ఇందులో భాగంగానే రైళ్లతో పాటు రైళ్ళ బోగీలను అమ్మకానికి, లీజుకు, అద్దెకు కూడా ఇచ్చేయాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పర్యాటక శాఖ, సినిమా రంగాల్లో బాగా అభివృద్ధి జరగటానికి అవకాశాలున్నట్లు కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. రైళ్ళను, బోగీలను అద్దెకు ఇవ్వటం వల్ల సాంస్కృతిక, పర్యాటక, సినిమాతో పాటు మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో స్పీడ్ పెరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ భావిస్తోంది.

రైళ్ళ బోగీలను కొనుక్కున్న వాళ్ళు, అద్దెకు తీసుకున్న వాళ్ళు వాటిని ఏ పద్ధతిలో నిర్వహించాలని అనుకుంటున్నారనే విషయాన్ని ముందుగానే రైల్వేశాఖకు చెప్పాల్సుంటుంది. ఎందుకంటే రైళ్ళను కొనుక్కోవటమంటే ఏదో కారును కొని ఇంట్లో పార్కు చేసుకున్నట్లు కాదు. రైళ్లు నిలపాలంటే అందుకు కచ్చితంగా ప్లాట్ ఫారంలు ఉండాల్సిందే కదా. ప్లాట్ ఫారం ఉండాలంటే అందుకు ముందుగానే ఒప్పందాలు చేసుకోవాల్సుంటంది. ఎందుకంటే రన్నింగ్ ట్రైన్లను నిలపాలంటే ప్లాట్ ఫారాల్లో ముందుగానే బుక్ చేసుకోవాలి.

ఒకవైపు రైల్వేశాఖ ఆధీనంలోని రైళ్ళు మరోవైపు ప్రైవేటు రంగంలో రైళ్ళను నిలపటంతో ప్రయాణికుల్లో అయోమయం ఏర్పడకూడదు. అందుకనే రైళ్ళను నిలిపి ఉండే ప్లాట్ ఫారంల విషయంలో స్పష్టత కోసం రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ళను లీజు, అద్దెకు తీసుకునే వాళ్ళు కనీసం 16 బోగీలను తీసుకోవాలనే నిబంధన పెట్టింది. తాము తీసుకున్న రైళ్ళను ఏ రూటులో నడపాలని అనుకుంటున్నారు ? ఎన్ని ట్రిప్పులు తిప్పాలని అనుకుంటున్నారు ? అనే విషయాలను ముందుగానే రైల్వేశాఖకు చెప్పాల్సుంటంది.

రైళ్ళను లీజు, అద్దెలకు తీసుకునే సినీ నిర్మాతలకు ప్రయాణానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. తమ యూనిట్ మొత్తాన్ని ఒకేసారి షూటింగులు జరుపుకునే ప్రాంతాలకు తరలించవచ్చు. అలాగే కాశీ, ప్రయాగ, తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్ళాలంటే టూరిజం ట్రిప్పులను నిర్వహించే పర్యాటక రంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే కారణాలు ఏవైనా, సౌకర్యాలు ఏమైనా కానీండి ప్రభుత్వ ఆస్తులను అమ్మేయటంలో నరేంద్ర మోడీ సర్కార్ చాలా స్పీడుగా ఉందని మాత్రం అర్థమవుతోంది.

This post was last modified on September 13, 2021 11:38 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

23 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago