పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఉన్నట్లుండి జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఆయన మీద నిన్న ఉదయం నుంచి హిందీలో పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతుండటం విశేషం. రాజకీయాల్లో పవన్ నిస్వార్థ పోరాటం గురించి నార్త్ ఇండియన్స్ పొగడ్తలు గుప్పిస్తూ ట్వీట్లు వేస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ పేరు హిందీలో నిన్న ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయింది. ఈ రోజు కూడా ఈ ఒరవడి కొనసాగుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేయడంపై ఇటీవల ఎంత పెద్ద రగడ జరిగిందో తెలిసిందే. ఈ విషయం జాతీయ స్థాయికి వెళ్లేలా చేయడంలో పవన్ పాత్ర కూడా ఉంది. ఆయన చేసిన ట్వీట్లు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యాయి. నేషనల్ ఛానెళ్లు కూడా దీనిపై చర్చ పెట్టాయి. ఐతే పవన్ ఈ ఇష్యూను ఎత్తుకున్న తర్వాత ఒక్క రోజులోనే టీటీడీ భూముల అమ్మకంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ విషయంలో పవన్ కృషిని గుర్తు చేస్తూ నార్త్ ఇండియన్స్ ట్వీట్లు వేస్తున్నారు. ఇంకా అతన చేసిన పలు మంచి కార్యక్రమాల్ని, పోరాటాల్ని గుర్తు చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఇందులో జనసేన మిత్ర పార్టీ భాజపా ప్రమేయం కూడా ఉంటే ఉండొచ్చు. బీజేపీ ప్రోగా పేరున్న రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి సైతం పవన్ మీద హిందీలో ట్వీట్ వేశాడు.
ఐతే తమ నాయకుడి పేరు హిందీలో ట్రెండ్ అవుతుండటంతో జనసేన మద్దతుదారులు, పవన్ సినీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. వాళ్లు అదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. వీళ్ల హడావుడి ఎక్కువైపోయింది. దీంతో నార్త్ జనాలు వేసిన ట్వీట్లన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కొంచెం ఆలస్యంగా విషయం తెలిసి పవన్ మీద ఏం ట్వీట్లు వేశారో.. అతడికి ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు ఏం జరిగిందో తెలియట్లేదు.
This post was last modified on May 31, 2020 12:54 pm
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…