ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వైఎస్ కుటుంబంతోపాటు ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిలతో కలిసి వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైయస్ విజయమ్మ…ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కు సన్నిహితంగా ఉన్న పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు అధికారులను విజయమ్మ ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి వైఎస్ ఆత్మగా పేరున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు హాజరవుతారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేవీపీ…వైసీపీ నేతగా ఉన్న విజయమ్మ నిర్వహించే కార్యక్రమానికి వెళతారా లేదా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను ఆ కార్యక్రమానికి హాజరుకాబోతున్నానని కేవీపీ క్లారిటీ ఇచ్చారు. వైయస్సార్ అందరికి కావాల్సిన వ్యక్తి అని, ఆత్మీయ సమ్మేళనానికి తాను కూడా వెళ్తున్నానని కేవీపీ చెప్పారు. తనకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారని వెల్లడించారు. వైయస్ ఆత్మీయ సమ్మేళనా’నికి కేవీపీ హాజరు కావడం వెనుక మతలబేంటి? వైఎస్సార్ టీపీకి ఆయన మద్దతివ్వబోతున్నారా? అన్న చర్చ మొదలైంది.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరగబోతోన్న ఈ కార్యక్రమానికి అప్పట్లో వైఎస్ తో కలిసి పనిచేసిన నాయకులు, అధికారులు, జర్నలిస్టులు హాజరు కాబోతున్నారు. మంత్రి బొత్స సత్యన్నారాయణతో పాటు మరి కొందరు వైసీపీ నేతలను, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్ తో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలను విజయమ్మ ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలకూ ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే, వైఎస్సార్ టీపీకి అండగా నిలిచేందుకే ఈ సభను విజయమ్మ నిర్వహిస్తున్నారని, ఈ సభ వెనుక కర్త, కర్మ, క్రియ పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ అని టాక్ వస్తోంది. కానీ, అప్పటి వైఎస్ విధేయులంతా ఇప్పుడు పలు రాజకీయ పార్టీల్లో పాతుకుపోయారు. ఇటు ఏపీలో వైసీపీకైనా, అటు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లకైనా వైఎస్సార్ టీపీ వైరి పార్టీనే అవుతుంది. అటువంటి సందర్భంలో షర్మిలకు మద్దతిస్తున్న విజయమ్మ నిర్వహించే ఈ సమ్మేళనానికి ఎవరెవరు హాజరవుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ, ఇది కేవలం వైఎస్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే కార్యక్రమం మాత్రమే అని, దానికి రాజకీయ ప్రత్యేకత లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 2, 2021 3:26 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…