తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై మెగా ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మొన్నటికి మొన్న చిరంజీవి.. స్టాలిన్ ని ప్రత్యేకంగా కలవగా.. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
బుధవారం చెన్నై వెళ్లిన చిరు.. సీఎం స్టాలిన్‌ను ఆయన ఆఫీస్‌లో కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. చిరంజీవి కుటుంబానికి స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.
అంతకుముందు స్టాలిన్ పాలనపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు జనసేనాని. మాటలే కాదు.. చేతల్లోనూ పాలన ఎలా ఉండాలో స్టాలిన్ చూపిస్తున్నారని పవన్ మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
“ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. మీ పాలన, పనితీరు తమిళనాడు ఒక్క దానికే కాదు.. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, రాజకీయ పార్టీలకూ ఆదర్శం, మార్గదర్శి. అంత మంచి పాలన అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు” అంటూ స్టాలిన్ ను ప్రశంసించారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)గా ఏర్పడిన ఆ పార్టీ.. 159 సీట్లను గెలుచుకుంది. ఒక్క డీఎంకేనే 133 స్థానాల్లో విజయం సాధించింది. స్టాలిన్ ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
This post was last modified on September 2, 2021 11:37 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…