ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన కచ్చితంగా మన జనాలు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విద్యా, ఉద్యోగ, ఉపాధి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడని తత్వమే భారతీయులను యావత్ ప్రపంచంలో విస్తరించేట్లు చేసింది. అంతేకాకుండా ఏ దేశ వాతావరణంలో అయినా ఇట్టే ఇమిడిపోయే మనస్తత్వం కూడా మనకే ఎక్కువ. ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికాలో విద్య, సంపాదనలో భారతీయులే అమెరికా కన్నా టాప్ లో నిలిచారట.
అమెరికాలో విద్య, కుటుంబ ఆదాయం పై న్యూయార్క్ టైమ్స్ ఈ మధ్యనే సర్వే చేసిందట. ఈ సర్వే ప్రకారం అమెరికా కన్నా మనవాళ్ళదే పై చేయిగా ఉందని స్పష్టంగా తేలిందట. అమెరికాలోని ప్రవాస భారతీయుల సగటు ఆదాయం రు. 92 లక్షలుంది. అదే అమెరికన్ల ఆదాయం చూస్తే రు. 47 లక్షలేనట. అంటే అమెరికన్ల సగటు ఆదాయం కన్నా ప్రవాస భారతీయుల సగటు ఆదాయం రెండింతలున్నట్లు సర్వేలో బయటపడింది.
అమెరికాలో ప్రవాస భారతీయులు 40 లక్షల మందున్నారట. వీరిలో వీసాల మీదున్న వారి సంఖ్య 16 లక్షలు. శాశ్వత పౌరసత్వం తో ఉన్న వారి సంఖ్య 14 లక్షలట. మరో 10 లక్షల మంది అమెరికాలోనే పుట్టారట. అంటే అమెరికా చట్టాల ప్రకారం అమెరికాలోనే పుట్టిన వారికి జన్మతహ పౌరసత్వం వచ్చేస్తుంది. ఇక చదువుల విషయానికి వస్తే ఆ దేశంలో కాలేజీ గ్రాడ్యుయేట్లు 34 శాతమట. ఈ 34 శాతంలో 79 శాతం వాటా భారతీయులదే అని సర్వేలో తేలింది.
సంపాదనలో భారతీయుల తర్వాత చైనా, ఫిలిప్పీన్స్ జనాలున్నారట. అత్యధిక వేతనాలు ఐటీ, ఆర్థిక, వైద్య రంగాల్లో వస్తున్నాయట. వీటన్నింటిలోనూ మనవాళ్ళదే పైచేయిగా ఉందని సర్వేలో స్పష్టంగా బయటపడింది. అమెరికాలోని మొత్తం డాక్టర్లలో భారతీయుల వాటా 9 శాతమట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంపాదనతో పాటు చదువులో కూడా చాలా దేశాలతో ప్రధానంగా అమెరికన్లతో పోల్చుకుంటే మన దేశ జనాలే ఎందుకు ముందంజలో ఉన్నారు ? అన్నది ప్రధానమైన ప్రశ్న.
దీనికి సమాధానం ఏమిటంటే తరతరలుగా మనలో ఇంకిపోయిన పొదుపు, చదువులపై ఉన్న మక్కువే కారణమని కూడా తేలింది. మనదేశంలో ఎంత సంపాదించారనే దాంతో సంబంధం లేకుండా కాస్త పొదుపు చేయడం అన్నది మన జీన్స్ లోనే ఉంది. అదే విదేశాల్లోని జనాల్లో పొదుపన్నది చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఇక చదువు విషయం తీసుకున్నా విదేశాల్లోని కుటుంబ వ్యవస్ధ కారణంగా అక్కడి పిల్లలకు పై చదువులకు అవకాశాలు తక్కువ. కానీ మన కుటుంబ వ్యవస్థ ప్రకారం పిల్లలను పెద్దలు దగ్గరుండి చదివించుకుంటారు. ఈ రెండు కారణాల వల్లే మిగిలిన వారికి మనల్ని భిన్నంగా ఉంచుతోంది.
This post was last modified on August 26, 2021 10:44 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…