కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీకి వచ్చిందా? ఆయన ఇక, తమకు దూరమేనని.. మానసికంగా సిద్ధమైందా ? అంటే.. తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్ల కిందట.. తెలంగాణలో పర్యటించిన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. కేరళకు చెందిన ఊమెన్ చాందీ.. చిరంజీవి తమ పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన సంచలనం రేపింది. అయితే.. ఆ వెంటనే ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు తదితరులు కాదు.. కాదు.. చిరు తమతోనే ఉన్నారని ప్రకటించారు.
ఇక, ఏపీ కాంగ్రెస్ చీఫ్ సాకే శైలజానాథ్ కూడా చిరును వెనుకేసుకు వచ్చారు. ఆయన కేవలం సినిమాల్లో బిజీగా ఉండడంతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని.. ప్రకటించారు. దీంతో ఇది నిజమేనేమో.. అని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా జరిగిన పరిణామాలను బట్టి.. చూస్తే.. చిరుతో కాంగ్రెస్‌కు దాదాపు తెగతెంపులు అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. చిరును ఇప్పుడు అటు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కానీ, ఇటు ఏపీలోని నేతలు కానీ.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి ప్రధాన నిదర్శనం.. ఆయన తాజాగా పుట్టిన రోజు జరుపుకొన్నారు.
అయితే..చిరు పుట్టిన రోజు నాడు.. గతంలో కాంగ్రెస్ నేతలు పుంఖాను పుంఖాలుగా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపేవారు. అదే సమయంలో తెలంగాణలో అయితే..కీలక నేతలు, మాజీ మంత్రులు ఆయన నివాసానికి చేరుకుని పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించేవారు. ఇక, ఏపీ నుంచి కూడా నేతలు క్యూ కట్టి చిరు నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెప్పి..ఫొటోలకు ఫోజులు ఇచ్చేవారు. కానీ, ఇప్పడు ఆ ఊసు ఎక్కడా కనిపించలేదు. పోనీ.. ఇప్పుడు కరోనా ఉందని అనుకున్నా.. డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని భావించినా.. ట్విట్టర్లు ఉన్నాయి, మీడియా ఉంది.. కానీ.. ఏ ఒక్కరూ చిరును పట్టించుకోలేదు.
చిరు కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వెరసి మొత్తంగా.. కాంగ్రెస్‌కు చిరు దూరమైనట్టేనని అంటున్నారు పరిశీలకులు. విచిత్రం ఏంటంటే చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపితే అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోలేదు.
This post was last modified on August 24, 2021 3:49 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…