టీడీపీకి పెద్ద సమస్యే వచ్చి పడింది. పార్టీలో నేతలు.. క్రియాశీలకంగా లేరు. ఉన్నవారు కూడా అధినేత చెప్పిన మేరకు మాత్రమే నడుచుకుంటున్నారు. తప్ప.. తమకంటూ..ప్రత్యేక వ్యూహాలతో ముందుకుసాగుతున్న నేతలు కనిపించడం లేదు. ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలన్నా.. నిరసన వ్యక్తం చేయాలన్నా.. కూడా చంద్రబాబు స్వయంగా కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరంగా పుంజుకునే అవకాశాలు కనపడడం లేదు. పైగా.. చంద్రబాబుపైనే భారంపడుతోంది. పార్టీని ముందుకు నడిపించేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసేవారు.. ప్రస్తుతం చంద్రబాబుకు కనిపించడం లేదు.
ఉన్నవారు పార్టీ కోసం పనిచేస్తున్నా.. అంతా తానే మానిటరింగ్ చేసుకోవాల్సి వస్తోంది.పార్టీ తరఫున ప్రభుత్వంపై యుద్ధం చేయాలన్నా.. అన్నీ తానే చేయాల్సి రావడం .. చంద్రబాబు చాలా భారంగా ఉందనే విషయం వాస్తవం. కొంత మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. వారు తమ పరిధిని దాటివ్యవహరించడంలేదు. ఈ క్రమంలో ఇప్పుడు పార్టీలో మేధావుల కొరత ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది. వారు నేరుగా జెండా మోసి..రోడ్డెక్కపోయినా.. వ్యూహాత్మకంగా.. నడిపించే స్థాయిలో ఐడియాలు ఇచ్చేవారు అయితే చాలనేది టీడీపీలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న టాక్. అయితే.. ఈ కొరతను తీర్చే నేతలు.. ఇప్పటి వరకు పార్టీలో కనిపించడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా.. సలహాదారులు, వ్యూహకర్తలు ఉండేవారు. వీరిలో ప్రస్తుతం టీడీపీకి దూరంఆ ఉన్న పరకాల ప్రభాకర్, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తటస్థంగా ఉన్న కుటుంబరావుల పేర్లుప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూకూడా చంద్రబాబుకుఅనేక రూపాల్లో సలహాలు ఇచ్చినవారే. అయితే.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేయాక్టివ్‌గా ఉండి.. ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు ఇలాదూరంగా ఉండడం వల్ల..పార్టీకి సరైన వ్యూహాలు లభించడం లేదని..కొందరు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇటీవల రాజధాని భూముల వ్యవహారం తెరమీదికి వచ్చినప్పుడు కుటుంబ రావు ఒక్కసారి మాత్రమే మీడియాముందుకు వచ్చారు. తర్వాత.. ఆయన ఎక్కడా కనిపించలేదు.
ఇక, పరకాల ప్రభాకర్ ఏకంగా .. హైదరాబాద్‌లో ఉంటూ..రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ,ఇటీవల ఆయన జనసేనపై విరుచుకుపడుతున్నారు.కానీ, అదేసమయాన్ని.. టీడీపీకి వెచ్చిస్తే.. బెటర్ అనేఆలోచనలు వస్తున్నాయి. కానీ, పరకాల మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇక, కుటుంబరావుపరిస్థితి కూడా ఇలానేఉంది. ఆయన టీడీపీకిఅనుబంధంగా ఉన్నప్పటికీ…తటస్థంగా ఉండడంతో వ్యూహాలు ఇచ్చేవారు.. పార్టీని సమర్థంగా నడిపించేందుకు అవసరమైన.. సరుకు మోసేవారు లేక.. టీడీపీ ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 22, 2021 6:04 am
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…