లాక్ డౌన్ అంటే వామ్మో అన్న వాళ్లంతా ఇప్పుడు ఆ మాటను లైట్ తీసుకుంటున్నారు. రెండో దశ లాక్ డౌన్ వరకు చాలా కఠినంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మూడో దశ నుంచి మినహాయింపులు మొదలుపెట్టాయి. నాలుగో దశలో చాలా వరకు షరతులన్నీ ఎత్తేశారు. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. థియేటర్లు, పెద్ద షాపింగ్ మాల్స్‌పై మాత్రమే ఆంక్షలున్నాయి.
రాజకీయ, మతపరమైన సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగుతోంది. రాత్రి వేళల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీని వల్ల జనాలకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న సమయంలో ఈ మినహాయింపులేంటి అన్న ప్రశ్నలు వస్తున్నప్పటికీ.. ఇంతకుమించి జనాల్ని కట్టడి చేస్తే చాలా కష్టమని భావించి ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చేశాయి.
కొన్ని పరిమితుల మధ్య నామమాత్రంగా నడుస్తున్న నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత ఏంటి అన్నదానిపై స్పష్టత లేదు. ఇంతకుముందు లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా.. అందరిలోనూ ఉత్కంఠగా ఉండేది. లాక్ డౌన్‌ను పొడిగిస్తారా.. ఏమైనా మినహాయింపులు ఇస్తారా అని చూసేవాళ్లు. ప్రధాని లేదంటే రాష్ట్ర సీఎం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఏదో ప్రకటన చేయబోతున్నారని అనగానే కౌంట్ డౌన్ మొదలైపోయేది. నిర్ణీత సమయానికి టీవీల ముందు వాలిపోయారు. కానీ ఇప్పుడు అలాంటి ఉత్కంఠ ఏమాత్రం లేదు.
లాక్ డౌన్ పొడిగింపు, మినహాయింపుల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారట. తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండబోతోందట. లాక్ డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారట.. ఇదీ తాజా మీడియా సమాచారం. ఐతే ఇప్పుడెలాగూ లాక్ డౌన్ నామమాత్రంగానే నడుస్తుండటంతో పొడిగించినా పోయేదేముంది అన్నట్లు జనాలు లైట్ తీసుకుంటున్నారు. మినహాయింపు విషయంలోనూ ఆసక్తి ఏమీ లేదు. గత ప్రెస్ మీట్లలో మాదిరి ఈసారి కేసీఆర్ ఏం చెబుతారా అని జనాలు టీవీల ముందు వాలిపోయే పరిస్థితి లేనట్లే.
This post was last modified on May 27, 2020 7:56 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…