వైసీపీలో కీలక నేతగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా.. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు.. ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు.. గత ఎన్నికలకుముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి.. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. తన హవాను మాత్రం సాగిస్తున్నారు. అయితే.. ఎప్పుడూ.. విశాఖ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఓ మహిళతో రాసలీలలు చేశారనే వీడియో వైరల్ అవుతోంది. ఇది.. వైసీపీలో ప్రకంపనలు రేపుతుండగా.. ప్రతిపక్షాలకు వరంగా మారింది. మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. “పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. ఓ అరగంటలో పంపిస్తా.” అంటూ మంత్రి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది.
అంతేకాదు, “నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది. చెప్పిన మాట విను” అంటూ మహిళను అవంతి బతిమాలుతున్నట్లుగా ఈ ఆడియో ఉంది. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది. మంత్రి రాసలీలలపై అప్పుడే విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీ నేతృత్వంలోని ఎస్వీబీసీ.. చానెల్ చైర్మన్‌గా వ్యవహరించిన.. సినీ నటుడు.. పృథ్వీపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయితే.. అప్పట్లో జగన్ సీరియస్‌గా తీసుకుని. ఆయనను వెంటనే తప్పించారు. మరి ఇప్పుడు అవంతి విషయంలో ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 20, 2021 6:59 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…