ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో ఊహించని షాక్ ఎదురైంది. తెలుగు దేశం పార్టీకి.. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య… టీడీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం అందుతోంది.
గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనితీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోరంట్ల బుచ్చయ్య… ఈ మేరకు టీడీపీ కి రాజీనామా చేయాలని ఆలోచన చేస్తున్నారట. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య.. 1995 టీడీపీ సంక్షోభం లోనూ ఎన్టీఆర్ వెంట వెళ్లారు.
అయితే.. 2014 లో అధికారంలోకి వచ్చిన అనంతరం.. మంత్రిగా గోరంట్ల బుచ్చయ్య కు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. అప్పటి నుంచే చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. పార్టీ పనితీరులోనూ చంద్రబాబు వైఖరి కూడా తప్పుగా ఉందనే నేపథ్యంలో రాజీనామాకి సిద్ధం కావడం గమనార్హం.
This post was last modified on August 19, 2021 6:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…