గాజువాక రియల్ హీరోగా జగన్ మెప్పు పొంది జనం తీర్పుతో ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి ఇదే మొదటి చివరి అవకాశం అంటున్నారు. ఆయన అంతకు ముందు 2009, 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడారు. ఆ సానుభూతి, జగన్ వేవ్ కలసి రావడంతో 2019 ఎన్నికల్లో ఆయన మూడవసారి పోటీ చేసినా జనం గెలిపించారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో మాత్రమేనని, రియల్ హీరోగా ఉన్న నాగిరెడ్డిని గెలిపించాలని జగన్ ఇచ్చిన పిలుపు గాజువాకలో బాగా వర్కౌట్ అయింది. ఇక పవన్ అంటే పడని సినిమా వాళ్లు కూడా గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే తిప్పల గెలిచిన తరువాత నుంచి వైసీపీ క్యాడర్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
కేవలం కుటుంబ రాజకీయానికే ఆయన పెద్ద పీట వేస్తున్నారు. తన వారసుడిగా తిప్పల వంశీరెడ్డిని తెచ్చి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ గా గెలిపించుకున్నారు. ఆయనను స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా చేశారు. మరో కుమారుడు దేవాన్ రెడ్డి కూడా పార్టీ పదవులలో ఉన్నారు. ఆయన సైతం తండ్రితో పాటే ఉంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటున్నారు. ఇలా తన కుమారులను రాజకీయంగా ముందుకు తీసుకువాలన్న తపనతోనే నాగిరెడ్డి ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన ప్రజా సమస్యలు కూడా పక్కన పెట్టేశారు అని జనాలు వాపోతున్నారు. ఇక గాజువాక రాజకీయం అంతా తిప్పల కుమారులే చక్క పెట్టేస్తున్నారు. చాలా పనులు వీరిని కలవందే జరిగే పరిస్థితి లేదని టాక్ ?
మరో వైపు చూస్తే తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో గాజువాకలో వైసీపీకి బాగా సీట్లు తగ్గాయి. అది ఎమ్మెల్యే పట్ల వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం అని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ బాగా ప్రభావం చూపించింది. ఆయన పార్టీ కోసం కష్టపడిన నాయకులకు టికెట్లు ఇవ్వకుండా తన కోటరీకి ఇచ్చిన ఫలితంగానే ఓటమి ఎదురైందన్న మాట కూడా ఉంది. మరో వైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగలు కూడా 2024 ఎన్నికల్లో నాగిరెడ్డికి గట్టిగా తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ సైతం నాగిరెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని నిశితంగా పరిశీలిస్తోంది అంటున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో తిప్పలకు టికెట్ దక్కదు అంటున్నారు. ఒకవేళ దక్కినా తిప్పలు తప్పవని కూడా ముందే జోస్యం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీలోనే పలువురు కీలక నేతలు ఖర్చీఫ్ వేసే పనిలో బిజీ అవుతున్నారు.
This post was last modified on August 19, 2021 3:50 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…