కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి భారీ ఊరట లభించింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.
2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిని ఆత్మహత్య గా నిర్ధారించుకుని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఓ రకంగా శశిధరూరే కారణమయ్యారని 2018లో మరోసారి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. శశిథరూర్ మరియు సునందా పుష్కర్ మధ్య జరిగిన చాటింగ్ , ఈ-మెయిల్స్ ఆధారంగా… చార్జిషీట్ బుక్ చేసిన పోలీసులు…. అనంతరం కోర్టు కు అందించారు. అయితే ఈ కేసును తాజాగా విచారించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు…. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు సునంద పుష్కర్ మృతికి ఎలాంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది.
మరోవైపు కోర్టు తీర్పు పట్ల శశిథరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఈ కేసు విషయమై ఎన్నో అనుమానాలను, అవమానాలను ఎదుర్కొంటున్నానని.. ఇప్పుడు తనకు ప్రశాంతత లభించిందని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 18, 2021 2:12 pm
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…