Political News

తాలిబన్లకు అమెరికా ట్విస్ట్

దేశం నుంచి వెళుతున్న అగ్రరాజ్యం అమెరికా తాలిబన్లకు పెద్ద షాకే ఇచ్చింది. తమ బ్యాంకుల్లో ఉన్న తాలిబన్ల ఖాతాలను అమెరికా ఫ్రీజ్ చేసేసింది. నాలుగు రోజుల క్రితమే మొత్తం ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో అరాచక పాలన మొదలైంది. ఈనెల 31వ తేదీ ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికాతో పాటు నాటో సైన్యం దేశం నుంచి వెళిపోవాలన్న విషయం తెలిసిందే. దీన్ని సాకుగా తీసుకున్న తీవ్రవాదులు అందరి అంచనాలకన్నా భిన్నంగా చాలా స్పీడుగా దేశాన్ని స్వాధీనం చేసేసుకున్నారు.

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తాలిబన్లు ఇంత స్పీడుగా యాక్ట్ చేయటం వెనుక కారణాలు ఏమిటి ? ఏమిటంటే ప్రధానంగా ఆర్ధిక వనరులన్న విషయం బయటపడింది. అత్యంత సంపన్న పది తీవ్రవాద గ్రూపుల్లో తాలిబన్లది 5వ స్ధానం. ఏడాదికి వందల మిలియన్ డాలర్ల సంపాదన ఉన్న కారణంగానే ఆర్ధికంగా తాలిబన్లు విపరీతంగా బలోపేతమయ్యారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా అందుతున్న విరాళాలు, ఓపియం లాంటి మాదక ద్రవ్యాల పంటలు పండించడమే.

ఏడాదికి ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల హయాంలో 15 వేల టన్నుల ఓపియం సాగు జరుగుతోంది. ప్రపంచంలో జరిగే ఓపియం సాగు, బిజినెస్ లో ఆఫ్ఘనిస్థాన్ వాటా 93 శాతం అంటే మామూలు విషయం కాదు. దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబన్లు ఓపియం సాగును లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు కాబట్టే వందలాది మిలియన్ డాలర్లు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సంపాదనతోనే తీవ్రవాదులు అత్యంత అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయటమే కాకుండా తమ సైన్యం అవసరాలను చూస్తున్నారు.

మరి అలా సంపాదించిన డబ్బు అంతా తాలిబన్లు ఎక్కడ దాచిపెడతారు ? ఎక్కడంటే వివిధ బ్యాంకుల్లో వివిధ సంస్ధల పేర్లతో డిపాజిట్లు చేస్తారు. ఈ విషయాన్ని గమనించిన అమెరికా తమ బ్యాంకుల్లో తాలిబన్లు దాచుకున్న నిధులను ఫ్రీజ్ చేసేసింది. తాలిబన్ల డబ్బు అమెరికాలోని వివిధ బ్యాంకుల్లో సుమారు 10 మిలియన్ డాలర్లుంటుంది. సరే అమెరికా తాలిబన్ల నిధులను ఫ్రీజ్ చేసినంత మాత్రాన ఏమవుతుంది ? ఇంకా చాలా బ్యాంకుల్లో ఖాతాలుంటాయి కదాని అనుకోవచ్చు.

ఒకసారి తాలిబన్ల అకౌంట్లను అమెరికా ఫ్రీజ్ చేస్తే మిగిలిన దేశాలు కూడా అదే పనిచేసే అవకాశాలున్నాయి. అప్పుడు తాలిబన్లకు తాత్కాలికంగానే అయినా నిధుల సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. కాకపోతే ఇపుడు ఆఫ్ఘన్లో అధికారంలోకి వచ్చేశారు కాబట్టి ఆ సమస్యను అధిగమించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా అమెరికా నిర్ణయం తాలిబన్లకు షాకిస్తాయనటంలో సందేహంలేదు.

This post was last modified on August 18, 2021 10:39 am

Share

Recent Posts

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

33 minutes ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

4 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

5 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

7 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

9 hours ago

పాపం అల్లు శిరీష్.. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…

9 hours ago