రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపిలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై ఏడుగురు కేంద్రమంత్రులు బాగా ఒత్తిడి తెస్తున్నట్లే ఉంది చూస్తుంటే. మొన్నటి 11వ తేదీన రాజ్యసభలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఎంపిలు పోడియం దగ్గర ఉద్యోగులు కూర్చునే బెంచీల మీదకు ఎక్కి అల్లరి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే మార్షల్స్ కు ఎంపీల మధ్య తోపులాటలు కూడా జరిగాయి.
మార్షల్స్ ను ఎంపిలు కొట్టారని కేంద్రమంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో మార్షల్సే తమపై దాడులు చేశారని ప్రతిపక్షాల ఎంపిలు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. పైగా బయటవ్యక్తులను మార్షల్స్ రూపంలో సభలోకి కేంద్రప్రభుత్వం పిలిపించిందంటు గోల చేస్తున్నారు. సరే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా కొందరు ఎంపిలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రుల నుంచి వెంకయ్యపై ఒత్తిడి పెరిగిపోతోంది.
అల్లర్లు జరిగిన రెండో రోజు నుండే ఎంపిలపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఏడుగురు కేంద్రమంత్రులు వెంకయ్యను డిమాండ్ చేశారు. అప్పటినుండి ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు డిమాండ్లు చేశారు. తాజాగా ఇదే అంశంపై ఆదివారం వెంకయ్యను కలిసి మళ్ళీ గట్టిగా డిమాండ్ చేశారు. అంటే ప్రతిపక్ష ఎంపిలపై చర్యల విషయంలో కేంద్రమంత్రులు ఓ వ్యూహం ప్రకారం నడుచుకుంటున్నారని అర్ధమవుతోంది.
ఇందులో భాగంగానే ఛైర్మన్ కూడా రాజ్యసభలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తో కలిసి పరిశీలించారు. సోమవారం అంటే ఈరోజు కూడా మరోసారి చూడబోతున్నారు. తర్వాత తన నివేదిక రూపంలో జరిగిన ఘటనను, తన సిఫారసును రాష్ట్రపతికి వివరిస్తారని సమాచారం. నిజానికి రాజ్యసభలో ఎన్డీయే కి పూర్తి మెజారిటీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. బిల్లులను పాస్ చేయించుకునే విషయంలో కేంద్రం ఇబ్బందులు పడుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు ఎంపీలపై వెంకయ్య కనుక చర్యలు తీసుకుంటే సభలో ప్రతిపక్షాల బలం తగ్గిపోతుంది. అప్పుడు సభలో బిల్లులను పాస్ చేయించుకునేందుకు ఎన్డీయే పెద్దగా కష్టపడక్కర్లేదు. అయితే సభలో పార్టీల బలాబలాలను లెక్కలు చూసిన తర్వాతే చర్యలకు రెడీ అవుతారు. కాకపోతే ఇపుడు కనుక చర్యలు తీసుకుంటే అది ఎప్పటినుండి ఎప్పటివరకు ఎఫెక్టులో ఉంటుందనేది కాస్త అయోమయంగా ఉంది. అందరు సీనియర్లే కాబట్టి అన్నీ విషయాలను చూసుకునే చర్యలకు రెడీ అవుతారు. చూద్దాం చివరకు ఏమవుతుందో.
This post was last modified on August 16, 2021 11:31 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…