Political News

జ‌గ‌న్‌లో ఆ ఇగో పోయిందా?

మొత్తానికి తెలుగు సినిమా నిర్మాత‌ల వేద‌న తీర‌బోతున్న‌ట్లే క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకున్నాయ‌న్న మాటే కానీ.. పూర్తి స్థాయిలో ఆదాయం మాత్రం రావ‌ట్లేదు. అందుక్కార‌ణం కొన్ని నెల‌ల కింద‌ట‌ ఏపీలో టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తేవ‌డ‌మే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ రిలీజ్ సంద‌ర్భంగా ద‌శాబ్దం కింద‌టి రేట్ల‌కు సంబంధించి జీవోను బ‌య‌టికి తీసి అధికారులు కొర‌డా ఝులిపించ‌డంతో ఇండ‌స్ట్రీకి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. అస‌లే క‌రోనా వ‌ల్ల దారుణంగా దెబ్బ తిన్న థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌కు ఈ జీవో అశ‌నిపాతంలా మారింది.

ఏపీ ప్ర‌భుత్వం ప‌వ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డానికే ఈ జీవోను బ‌య‌టికి తీసి టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తెచ్చింద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. కానీ అత‌ణ్ని ఇబ్బంది పెట్ట‌బోయి మొత్తం ఇండ‌స్ట్రీ మెడ‌కు చుట్టుకుంది. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇది పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా మారింది.

ఈ ప‌రిస్థితుల్లో నిర్ణ‌యాన్ని ఎలా వెన‌క్కి తీసుకోవాలో తెలియ‌ని సంక‌ట స్థితిలో ప‌డింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. వెంట‌నే నిర్ణ‌యాన్ని మారిస్తే ప‌వ‌న్‌ను ఇబ్బంది పెట్టేందుకు తాత్కాలికంగా హ‌డావుడి చేశార‌న్న సంకేతాలు జ‌నాల్లోకి వెళ్తాయి. అందుకే కొన్నాళ్లు వేచి చూశారు. ఇప్పుడు స్వ‌యంగా ప్ర‌భుత్వం నుంచి టాలీవుడ్ పెద్ద‌ల‌కు చ‌ర్చ‌ల కోసం పిలుపు వెళ్లింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఇగో ప‌క్క‌న పెట్టి చిరు అండ్ కోకు క‌బురు పంప‌డం విశేష‌మే. టికెట్ల రేట్లు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రి మార‌కుంటే మున్ముందు అది జ‌గ‌న్‌కు మ‌రింత చెడ్డ పేరు తేవ‌చ్చు.

అందుకే ఇగో పక్క‌న పెట్టి సినీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ పిలుపు పంపిన‌ట్లు తెలుస్తోంది. మున్ముందు పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ కాబోతున్నాయి. వాటికీ టికెట్ల నియంత్ర‌ణ తీసుకొస్తే ఏపీ ప్ర‌భుత్వానికి అంద‌రు హీరోల అభిమానుల నుంచి వ్య‌తిరేక‌త త‌ప్ప‌దు. అందుకే ఇప్పుడిలా పిలిచి మ‌రీ మీటింగ్ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on August 15, 2021 11:27 am

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

21 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

41 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago