ఇపుడిదే అంశంపై టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. మొన్న జూలై నెలలలోనే కారు పార్టీలో కౌశిక్ చేరారు. అయితే ఆగస్టు 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ ను ఎంఎల్సీ గా నామినేట్ చేయాలని తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ కార్యాలయానికి ఫైల్ పంపినట్లు అధికార వర్గాలు చెప్పాయి.
అయితే ఇప్పటివరకు గెజెట్ ప్రకటన రాకపోవటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి కౌశిక్ ను ఎంఎల్సీ గా చేయటం పార్టీలోని చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ లో చేరిన వెంటనే పదవి ఇచ్చేయటాన్ని చాలామంది టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే విషయాన్ని కేసీఆర్ తో చెప్పే ధైర్యం లేదు కాబట్టి నేతల మధ్యనే చర్చల్లో నలుగుతోంది. సరే నేతలు ఎంతమంది అనుకున్నా ఉపయోగం లేదు కాబట్టి చేసేది లేక మౌనంగా ఉండిపోయారు.
గవర్నర్ కోటాలో ఎవరిని ఎంఎల్సీగా ముఖ్యమంత్రి కార్యాలయం పంపినా వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేసేస్తారు. ఇందులో గవర్నర్ కు ప్రత్యేకమైన ఇంట్రస్టంటు ఏమీ ఉండదు కాబట్టి సీఎం నిర్ణయమే ఫైనల్. అలాగే కౌశిక్ ఫైలుపై గవర్నర్ సంతకం పెట్టేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఫైల్ పంపి పది రోజులైనా అతీగతీ కనబడలేదట. దాంతో ఫైలు వెనకాల ఏమి జరుగుతోందో నేతలకు అర్ధంకాక బుర్రలు గోక్కుంటున్నారు.
ఇదే విషయాన్ని కనుక్కోవాలని సీఎంవో అధికారులను అడిగినా, జీఏడీ ఉన్నతాధికారులను అడిగినా తమకేమీ తెలీదంటున్నారట. పోనీ గవర్నర్ కార్యాలయంలో వాకాబు చేద్దామంటే అక్కడి అధికారులు కూడా నోరిప్పటంలేదట. అంటే మంత్రివర్గం నిర్ణయం తర్వాత ఫైలు సీఎంవోలేనే ఆగిపోయిందా ? లేకపోతే గవర్నర్ కార్యాలయంలో పెండింగ్ ఉందా అనేదే ఎవరికీ అర్ధం కావటంలేదు. ఒకవేళ గవర్నర్ సంతకం అయిపోతే అదేరోజు గెజెట్ కూడా వచ్చేస్తుంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే కౌశిక్ తెలంగాణా రాష్ట్రానికి పూర్తి వ్యతిరేకమట. తెలంగాణా కోసం ఉద్యమం జరిగిన రోజుల్లో ఈయన ఆధ్వర్యంలో వ్యతిరేక ఉద్యమం జరిగిందట నియోజకవర్గంలో. ఆ సందర్భంగానే కౌశిక్ పై అనేక కేసులు కూడా నమోదయ్యాయట. సరే ఈ విషయాన్ని వదిలేస్తే ఈయనపై సుమారు 12 కేసులు పెండింగ్ లో ఉన్నాయట. చిన్నా, పెద్దా కేసులు కలిపి సంవత్సరాల తరబడి విచారణలోనే ఉన్నాయట చాలా కేసులు. మరి ఈ విషయం గవర్నర్ దృష్టికి వెళితే ఫైలును పెండింగ్ లో పెట్టారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా కౌశిక్ ఎంఎల్సీ విషయం మాత్రం సస్పెన్సు పెరిగిపోతోంది.
This post was last modified on August 11, 2021 12:02 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…