ప్రధానమంత్రి నరేంద్రమోడి వైఖరి గురివిందగింజ లాగే తయారైంది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలన్నింటినీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతల, ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే అంశం ఉభయసభలను ఊపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జూలై 19వ తేదీన పార్లమెంటు వర్షాకల సమావేశాలు మొదలైనప్పటినుండి మొబైల్ ట్యాపింగ్ అంశంపై ఉభయసభల్లోను ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి.
ట్యాపింగ్ అంశంపై ప్రతిపక్షాలు ఎంత గోల చేస్తున్న మోడి మాత్రం నోరిప్పటంలేదు. సింపుల్ గా ట్యాపింగే జరగటంలేదని ఐటి శాఖ మంత్రితో చెప్పించింది కేంద్రం. కానీ తమ ప్రశ్నలకు ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. అయితే సభల్లో ఎంత గొడవలు చేసినా తాను మాత్రం సమాధానం చెప్పేదిలేదని మోడి భీష్మించుకుని కూర్చున్నారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం ఉపయోగించటం లేదన్నదే నిజమైతే అదే విషయాన్ని పార్లమెంటులోనే మోడి ఎందుకు చెప్పకూడదు ?
పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు చేయటం ఇదే మొదలుకాదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్ వేలంపాటల విషయంలో ఇలాగే చేసింది. అంతకుముందు రక్షణ సామగ్రిలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలపైన కూడా కమలంఎంపిలు ఇదే పద్దతిలో సభల్లో గోలచేసింది. రెండు సందర్భాల్లో కూడా బీజేపీ ఎంపిలు సుమారు 40 రోజుల పాటు సభలను జరగనీయకుండా అడ్డుకున్నారు.
ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే విధంగా గోలచేసే బీజేపీ ఇపుడు ప్రతిపక్షాలకు బుద్ధులు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలు ఇఫుడు చేస్తున్న గోలకు మోడి వైఖరే ప్రధాన కారణమని అర్ధమైపోతోంది. ప్రతిపక్షాలు ఏ అంశంపై చర్చ జరగాలని, సమాధానం చెప్పాలని పట్టుబట్టినా మోడి సభలో నోరిప్పింది లేదు. ఇపుడు కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంపై పార్లమెంటులో మోడి ఎందుకని నోరిప్పటంలేదు ? పార్లమెంటులో మాట్లాడాల్సిన మోడి బీజేపీ ఎంపిల సమావేశంలో మాట్లాడ్డంలో అర్ధమేంటి ?
పార్లమెంటులో మోడి మాట్లాడితే దాన్ని అడ్డుకోవటానికి లేదా దానికి ధీటుగా ప్రతిపక్షాల నేతలు కూడా మాట్లాడుతారు. వాళ్ళకు మోడి సమాధానం చెప్పే పరిస్ధితి ఉండకపోవచ్చు. అదే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అయితే మోడి చెప్పిందానికి ఎంపిలు వినటం తప్ప కనీసం సందేహాలు తీర్చుకునేంత సీన్ కూడా ఉండదు. ప్రతిపక్షాల విషయాన్ని వదిలిపెట్టేస్తే కనీసం ఎన్డీయే పక్షాల సమావేశమైనా మోడి నిర్వహించి పెగాసస్ విషయంలో ఏమి జరిగిందో చెప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
This post was last modified on August 8, 2021 11:06 am
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…