తమ రాజకీయాలకు క్రీడలను కూడా కమలనాదులు వదలిపెట్టడంలేదు. ఒలంపిక్స్ లో కొన్ని పతకాలు రాగానే అవన్నీ తమ ప్రభుత్వ విధానాల వల్లే, ప్రోత్సాహం వల్లే సాధ్యమవుతోందంటు బీజేపీ నేతలు, దాని అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలో పోస్టులతో హొరెత్తించేస్తున్నారు. సరే దీనికి ధీటుగానే నెటిజన్లు కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారనుకోండి అది వేరే సంగతి.
తాజాగా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని నరేంద్రమోడి సర్కార్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చేసింది. దేశానికి మాజీ ప్రధానమంత్రి రాజవీ గాంధి చేసిన సేవలకు గుర్తుగా క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కేంద్రప్రభుత్వం 1991-92 లో మొదలుపెట్టింది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మార్చేసినట్లు మోడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే తొందరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే బీజేపీ చివరకు క్రీడలను కూడా వాడుకుంటున్నట్లు నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు. ఎలాగంటే మేజర్ ధ్యాన్ చంద్ ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. నిజంగానే ధ్యాన్ చంద్ పై కేంద్రప్రభుత్వానికి అంత ప్రేమే ఉండుంటే అధికారంలోకి వచ్చిన ఏడేళ్ళల్లో ఎందుకు పట్టించుకోలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరు మార్చకుండానే ధ్యాన్ చంద్ పేరుతో మరో పురస్కారాన్ని ప్రకటించి ఉండచ్చు కదాని నెటిజన్లు మోడిని సూటిగానే నిలదీస్తున్నారు. ఇప్పటికే ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతున్నారు.
మోడి తాజా వ్యవహరం చూస్తుంటే కావాలనే కాంగ్రెస్ నేతలను రెచ్చగొడుతున్నారని అర్ధమైపోతోంది. 1991 నుండి వాడుకలో ఉన్న పురస్కారం పేరు మార్చాల్సిన అవసరమే లేదు. ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను గౌరవించాలనే పురస్కారం పేరును మార్చినట్లు మోడి చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారంతో అసలు మామూలు జనాలకు సంబంధమే లేదు.
అసలు ఖేల్ రత్న పురస్కారానికి రాజవ్ గాంధీ పేరుమార్చి ధ్యాన్ చంద్ పేరు పెట్టమని అడిగిన జనాలెవరో తెలీదు. ఎవరు కూడా ఎప్పటినుండో ఉన్న పేరుమార్చి దానికే కొత్త పేరు పెట్టమని అడగరు. మొత్తానికి క్రీడలను కూడా వదిలిపెట్టకుండా నరేంద్రమోడి అండ్ కో బాగానే రాజకీయాలు చేస్తున్నారన్న విషయం బయటపడింది. మరి యూపీ జనాలు ఏమి చేస్తారో చూడాలి.
This post was last modified on August 7, 2021 12:19 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…