తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు.
అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్‌లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో ఈ నెల 30వ తేదీ నుండి విక్రయిస్తారు. కొంతమంది భక్తులు ప్రసాదం లేక వెనుదిరగాల్సి వచ్చింది.
రేపటి నుండి మరో రెండు లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. లడ్డూ ప్రసాదం కోసం తెలంగాణ, తమిళనాడు భక్తుల నుండి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. తమిళనాడుకు ఒక లక్ష, తెలంగాణకు 50వేల లడ్డూలు తరలించాలని టీటీడీ భావిస్తోంది. లడ్డూ ప్రసాదాన్ని ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రంనుంచి లేదా టీటీడీ కళ్యాణ మండపం నుంచి ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
లడ్డూ ప్రసాదాన్ని డిస్కౌంట్‌తో విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో రూ.25కే ఇస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ ధరనే ఉండనుంది. వెయ్యి కంటే ఎక్కువ లడ్డూలు కావాలంటే తమ పేరు, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు ఐదు రోజుల ముందు ఇస్తే ఆ తర్వాత ప్రసాదం పంపిస్తారు. ఇందుకు 9849575952కు ఫోన్ చేయాలి.
పెద్ద మొత్తంలో లడ్డూలు కావాలనుకుంటే tmlbulkladdus@gmail.com. కు మెయిల్ కూడా చేయవచ్చు. లడ్డూ ప్రసాదం వివరాల కోసం 18004254141, 1800425333333 నెంబర్‌ను సంప్రదించవచ్చు. 13 జిల్లాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూలు విక్రయిస్తారు.
This post was last modified on May 26, 2020 10:42 am
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…