Political News

వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?

ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది.

ఇంతకీ జరిగిందేమంటే జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుండి మట్టితవ్వకాలకు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల నుండి మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రోఫార్మ్స్ ప్రైవేటులిమిటెడ్ కు మట్టి అవసరమని ఎం శ్రీనివాసులరెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో వచ్చిన దరఖాస్తుకు కూడా అధికారులు అనుమతులిచ్చారు. ఆ తర్వాత బీ శ్రీధర్ రెడ్డి, ఎం శ్రీనివాసులరెడ్డి పేరుతో కూడా మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులిచ్చారు.

అంటే మట్టితవ్వకాలకు మొత్తం ముగ్గురికి అనుమతులిచ్చారు. అయితే మట్టిని తీసుకుపోవాల్సిన చోటుకు కాకుండా మార్కెట్ కు తరలించారని, అలాగే అనుమతులు పొందిన పరిణామం కన్నా బాగా ఎక్కువగా తవ్వేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల ఆధారంగా ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేశారు. దాంతో అనుమతులకన్నా ఎక్కువ మట్టిని తవ్వేసినట్లు నిర్ధారణైంది.

దాంతో ఇరిగేషన్ అధికారులు మొత్తం ముగ్గురిపైనా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు కేసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో ముగ్గరిలో ఒకరు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్న విషయం బయటపడింది. దరఖాస్తులో ఎం శ్రీనివాసుల రెడ్డి అని ఉన్నా ఎంపినే దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గమనించాలేదు. అయితే అసలు దరఖాస్తు చేసింది ఎంపియేనా ? అన్న అనుమానాలు ఇపుడు మొదలైంది.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పాపురైన మాగుంట కుటుంబం ఇంతచిన్న పరిణామంలో మట్టితవ్వకానికి అనుమతులు తీసుకుంటుందా అనే సందేహం పెరిగిపోతోంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఎంపి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంకెవరో దరఖాస్తు చేసుకుని ఉండచ్చనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ముగ్గిరిపైనా పోలీసులు కేసులు నమోదుచేయటం అందులో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఉండటం జిల్లాలోను, పార్టీలో సంచలనంగా మారింది.

This post was last modified on August 6, 2021 9:36 pm

Share

Recent Posts

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

15 minutes ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

29 minutes ago

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…

57 minutes ago

బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…

3 hours ago

లోక‌ల్‌వార్‌లో జ‌న‌సేన కోరిక‌లు బాబు తీర్చేనా..?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జ‌న‌సేన నాయ‌కుల కోరిక‌లకు కూట‌మి పెద్ద టీడీపీ గ్రీన్‌సిగ్న‌ల్…

5 hours ago

మారెమ్మకు మాస్ రాజా ప్రోత్సాహం సరిపోతుందా

స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…

5 hours ago