పార్లమెంటులో జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాల నేతలు, దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా సుమారు లక్షమంది మొబైల్ ఫోన్లను పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణల సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయమై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి.
పార్లమెంటులో చర్చకు అనుమతించాలని లేదా ప్రధానమంత్రి నరేంద్రమోడి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రతిపక్ష నేతల డిమాండ్ కు మోడి అస్సులు నోరే విప్పటంలేదు. ఈ నేపధ్యంలోనే అసలు విషయంపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు పార్లమెంటు స్టాండింగ్ కమిటి పార్లమెంటులో బుధవారం సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగకుండా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు.
అసలు కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందా లేదా అనే అంశంపై ఉన్నతాధికారుల వెర్షన్ తెలుసుకునేందుకు స్టాండింగ్ కమిటి సమావేశమైంది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ మెజారిటి సభ్యులు మాత్రం బీజేపీ ఎంపిలే. సమావేశానికి శశిథరూర్ , ఇతర పార్టీల సభ్యులు హాజరైనట్లే బీజేపీ ఎంపిలు కూడా హాజరయ్యారు. అయితే సమావేశంలో ఉన్నతాధికారులను నోరెత్తనీయకుండా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు. అసలు సమావేశం మొదలైన తర్వాత మినిట్స్ బుక్ లో సంతకాలు పెట్టడానికే నిరాకరించారు.
మినిట్స్ బుక్ లో సభ్యులు సంతకాలు పెట్టకపోతే సమావేశం జరిపేందుకు లేదు. ఈ విషయం తెలుసుకునే బుక్ లో బీజేపీ ఎంపిలు సంతకాలు పెట్టలేదు. దాంతో సభ్యుల మధ్య ఎంతసేపు చర్చలు జరిగినా ఉపయోగం లేకపోవటంతో సమావేశాన్ని ముగించేశారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ ఎంపిలు సమావేశాన్ని అడ్డుకున్న విషయం అర్ధమైపోతోంది. బీజేపీ ఎంపిల చర్యతో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం కొనుగోలు చేసిందని, అనుమానితులందరి మొబైళ్ళను ట్యాపింగ్ చేయించిందని అర్ధమైపోయింది. విచిత్రమేమిటంటే ట్యాపింగ్ అయిన ఫోన్లలో కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీల ఫోన్లు కూడా ఉండటమే.
This post was last modified on July 29, 2021 6:41 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…