అధికారంలో ఉన్నపుడు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత చాలా ధాటిగానే మాట్లాడేవారు. ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఎదుర్కొన్న తీరుని చూసి అంతా ఆమెను మెచ్చుకున్నారు. చంద్రబాబు కూడా ఆమెనే వైసీపీ మీద ప్రయోగించేవారు. మరోవైపు నాటి మంత్రివర్గంలో మహిళలుగా పరిటాల సునీత, పీతల సుజాత లాంటి వాళ్లు ఉన్నా కూడా రోజా లాంటి వాళ్లకు అనితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు.
ఒక దశలో ఆమె పేరు మంత్రి పదవి కోసం కూడా చంద్రబాబు పరిశీలించారని చెబుతారు. అయితే లక్ ఆమెకు లేకపోవడంతో ఆ ఛాన్స్ దక్కలేదు, ఇక మరో ఆఫర్ గా ఆమెకు టీటీడీ మెంబర్ ఇచ్చారు. అయితే ఆమె హిందువు కాదు అంటూ వివాదాన్ని రేపడంతో ఆ పదవీ పోయింది. ఇక 2019 ఎన్నికల వేళ పాయకరావుపేట టికెట్ అనితకు ఇవ్వలేదు. ఆమెను గోదావరి జిల్లాల్లోని కొవ్వూరుకు పంపించారు. దాంతో అక్కడ పొటీ చేసి ఆమె ఓడిపోయారు.
ఇక టీడీపీ విపక్షంలోకి వచ్చిన తరువాత అనితను రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేశారు. అలా మొదట్లో ఆమె మత్తు డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ లో బాగానే వైసీపీ సర్కార్ మీద పోరాడారు. పాయకరావుపేట టీడీపీ కేడర్ ఆమెను వద్దని ఎంత ఒత్తిడి చేసినా కూడా చంద్రబాబు వారి మాటలు పక్కన పెట్టి మరీ తిరిగి ఆమెకే పాయకరావుపేట పార్టీ పగ్గాలు కట్టబెట్టారు.
ఆ తర్వాత టీడీపీలో మంత్రులుగా చేసిన వారు, సీనియర్లు అంతా సైలెంట్ అయిన వేళ విశాఖలో అనిత గొంతు బాగానే విప్ప్పారు. అయితే ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే ఆమె తగ్గిపోయారు అని చెబుతారు. పార్టీలో ఒక రకమైన నిస్తేజం, అధినాయకత్వం తీరుతో కూడా ఆమె ఇదివరకు మాదిరిగా సౌండ్ చేయడంలేదు అంటున్నారు. ఆమెను పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా చంద్రబాబు చేశారు.
అయితే ఆమెకు పాయకరావుపేటలో ఇప్పటకీ పట్టు చిక్కడం లేదు. ఈ రోజుకీ ఆమె పాయకరావుపేటకు నాన్ లోకల్ గానే ఉన్నారు. ఆమె విశాఖలోనే మకాం పెట్టారు. ఇక టీడీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఆమె వ్యతిరేక వర్గం కూడా గట్టిగానే ఉంది.
దీంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బాగానే పాతుకుపోయారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. దాంతో పాటు వైసీపీ పధకాలు కూడా జనాలకు బాగానే చేరుతున్నాయి. ఇక వైసీపీని ఆయన అక్కడ బాగా స్ట్రాంగ్ గా చేశారు. బాబూరావుకే మళ్ళీ టికెట్ ఇస్తారు అన్న మాట కూడా ఉంది. ఆయన కనుక క్యాండిడేట్ అయితే మాత్రం అనితకు గెలుపు అంత సులువు కాదనే అంటున్నారు. మొత్తానికి అటు నియోజకవర్గంలోనూ, ఇటు పార్టీలోనూ అనుకూల పరిణామాలు లేకపోవడంతోనే అనిత ఒక్కసారిగా జోరు తగ్గించారు అంటున్నారు.
This post was last modified on July 29, 2021 1:35 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…