ఏపీ సీఎం జగన్ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆదిలోనే అంటే.. కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్న సమయంలోనే 90 శాతం మంది మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత.. మారుస్తానని.. అందరికీ అవకాశం ఇవ్వలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. సో.. దీనిని బట్టి రెండున్నరేళ్ల తర్వాత..కేబినెట్ విస్తరణకు జగన్ మొగ్గు చూపకతప్పదు. దీంతో చాలా మంది నాయకులు.. మలివిడత మంత్రి వర్గ విస్తరణపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
తొలి విడతలో అవకాశం దక్కని వారికి మలి విడతలో ఖాయమనే వాదన ఉంది. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదారుగురు.. ఆశలు పెట్టుకున్నారు. రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే.. తమకు ప్రాధాన్యం దక్కుతుందని.. అనుకున్నా.. జగన్ తమను పట్టించుకోవడం లేదని.. ఈ వర్గం ఆవేదనగా ఉంది. అదేసమయం లో కమ్మ వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయిందని.. ఆ వర్గం నేతలు కూడా నిరాశగా ఉన్నారు. పైగా.. ఈ వర్గానికి చెందిన ఒక కీలక నేతకు జగన్ హామీ ఇచ్చి కూడా అమలు చేయలేక పోతున్నారనే వాదన ఉంది.
ఇవన్నీ ఇలా ఉంటే.. జగన్ తమకు వ్యతిరేకమని.. రాజధాని అమరావతి విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానాలను గమనిస్తున్న కమ్మ వర్గం నిర్ణయించుకుంది. సో.. ఇప్పుడు ఈ రెండు వర్గాలను శాంతిప జేయాల్సిన అవసరం జగన్‌పై ఉంది. ఇక, ఇతర సామాజిక వర్గాలను చూసుకుంటే.. కాపులకు కూడా మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇద్దరు కాపు సామాజికవర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. అదేసమయంలో ఎస్సీ, ఎస్టీలకు , మైనారిటీలకు ప్రాధాన్యం తప్పదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అసలు మంత్రి వర్గంలో ప్రాధాన్యమే లేదనే గుసగుస వినిపిస్తోంది.
ఇన్ని ఈక్వేషన్లను సరిచేసుకుంటూ.. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉందని.. ఒకవైపు వైసీపీలోనే చర్చ సాగుతుండగా.. ఇప్పుడు మరో విషయం తెరమీదికి వచ్చింది. అసలు ఇవన్నీ కావు.. సామాజిక వర్గాలు.. అసంతృప్తులను బుజ్జగించడం.. వంటివిషయాలు చిన్నవని.. వచ్చే ఎన్నికలే.. జగన్‌కు అత్యంత కీలకమని.. అందుకే ఎన్నికల కేంద్రంగా.. ఆయన మంత్రి వర్గ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని.. వైసీపీలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. సో.. దీనిని బట్టి యాక్టివ్‌గా ఉన్న లీడర్లకు మాత్రమే ఆయన పదవులు ఇస్తారని.. ప్రజల్లో సానుభూతి పెంచడంతోపాటు.. ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టగలరనే ఆశలు ఉన్న వారికి కేబినెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 27, 2021 6:33 pm
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…