రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు సరిపోక.. ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన మరిన్ని హామీల విషయం ఏంటి? మరీ ముఖ్యంగా పాదయాత్ర సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం ఎలా? వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర స్వరూపాన్ని మార్చుతామన్న హామీని ఎలా నిలబెట్టుకోవాలనే విషయాలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తర్జన భర్జన పడుతున్నారు.
ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జగన్.. రాష్ట్ర స్వరూపం మార్చేందుకు తన వద్ద ప్రణాళిక ఉందని తెలి పారు. రాష్ట్రాన్ని మరిన్ని జిల్లాలుగా విస్తరించడం ద్వారా.. పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందు కు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి ఏడాది చివరిలో జగన్ స్వయంగా దృష్టి పెట్టారు. మంత్రులు, జిల్లాల కు ప్రస్తుతం ఇంచార్జులుగా ఉన్నవారు.. జిల్లా కలెక్టర్లతో వరుస భేటీలు నిర్వహించి.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక బూమ్ తీసుకువచ్చారు. ఇక, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఎన్నికల కమిషనర్.. నీలం సాహ్ని నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేశారు.
అయితే.. ఆ తర్వాత.. ఈ వ్యూహం వెనక్కి పోయింది. జిల్లాల ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆర్థికంగా ఇబ్బందులు పెరిగిపోయాయనేది నిర్వివాదాంశం. జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడం, హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేయడం, వాహనాలు సమకూర్చడం.. వంటి అనేక విషయాల్లో అప్పటి వరకు ఆర్థికంగా బాగానే ఉన్న తెలంగాణ పరిస్థితి ఒకింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. బహుశ అనుభవాల నేపథ్యంలోనే సీఎం జగన్.. వెనక్కి తగ్గారా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం జిల్లాల ఏర్పాటుకు బాగానే నిధుల అవసరం ఉంది.
అదేసమయంలో.. ప్రజల నుంచి ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే.. జిల్లాల ఏర్పాటు.. రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఆర్థిక కష్టాలు.. ఇతరత్రా ఆందోళనలు.. వంటి కారణా లతో ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. మరోవైపు పాదయాత్ర సమయంలో ఇచ్చిన మరికొన్ని హామీల విషయంలోనూ జగన్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేక పోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై వైసీపీ సీనియర్లు కూడా చర్చించుకుంటున్నారు. భారీ ఎత్తున చేస్తున్న సంక్షేమ ఖర్చు .. కీలక అంశాలపై ప్రభావం పడేలా చేసిందని అంటున్నారు. మరి.. జగన్ ఎప్పటికి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on July 24, 2021 9:44 pm
మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ క్లాష్ కూడా టీమిండియా మేన్స్ తరహాలో కొనసాగుతుండడం విశేషం. 2024 మేన్స్ టీ20 వరల్డ్…
కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకునేవారే. అయితే…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాన్నాళ్ల తర్వాత తన గళాన్ని విప్పారు. 2023 ఆకరులో జరిగిన…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నిలుచుంటే…మరోవైపు మాజీ ఎమ్మెల్యే…
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోతున్న సౌత్ హీరోయిన్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా రష్మిక మందన్నా పేరు…
భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. లక్నోలో జన్మించిన భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్…