Political News

కేసీఆర్, క‌విత ఉలిక్కి ప‌డే నిర్ణ‌యం తీసుకోనున్న రేవంత్

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ మ‌త్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ నేప‌థ్యంలో మొద‌లైన ఈ వేడి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని రేవంత్ రెడ్డికి అప్ప‌గించ‌డంతో తారాస్థాయికి చేరింది. అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ ముఖ్య‌నేత‌ల మ‌ధ్య పోరుతో ఇంకా రంజుగా మార‌నున్న‌ట్లు చెప్తున్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌విత , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచ‌రుల్లో ఒక‌రైన ఎమ్మెల్యే సీత‌క్క గురించి.

తెలంగాణలో జ‌రిగే ఎన్నిక‌ల్లో అత్యంత ఉత్కంఠ‌ను రేకెత్తించే వాటిలో సింగరేణి ఎన్నికలు ఒక‌టి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నాటికి ముగిసిపోయింది.

ఈ నేప‌థ్యంలో సింగరేణి కాలరీస్‌లో ఈ పోరు అంతకంతకు రాజుకుంటోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అయితే, ముఖ్య కార్మిక సంఘాల‌కు ప్ర‌ధాన పార్టీలు అండ‌గా ఉండ‌టంతో స‌హ‌జంగానే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ‌మైన‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) విజయం సాధించింది. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధతి కారణంగా ఎన్నికలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగే అవకాశాలు ఉండ‌గా టీఆర్ఎస్ అందుకు త‌గ్గ‌ట్లు వ్యూహాలు ర‌చిస్తోంది.

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సింగ‌రేణి కార్మికుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కొందరు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్ల‌డించారు. దీంతోపాటుగా సింగ‌రేణి కోసం మెడిక‌ల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం త‌ర‌ఫున గెలుపు కోసం ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలైన ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) తరఫున ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష పోరు జ‌ర‌గ‌నుంద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on July 23, 2021 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

షేక్ హ్యాండ్స్‌కు దూరం: సీఎం రేవంత్ వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైర‌స్ విష‌యంలో వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త‌లకు ప్రాధాన్యం ఇచ్చారు.…

5 hours ago

కుప్పానికి వ‌స్తే.. ఆయుష్షు పెరిగేలా చేస్తా: చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగ‌ళూరుకు క్యూ క‌డుతున్నార ని.. భ‌విష్య‌త్తులో కుప్పానికి…

5 hours ago

విజయ్ దేవరకొండ 14 కోసం క్రేజీ సంగీత జంట

హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…

8 hours ago

అదనపు 20 నిమిషాలతో రీ లోడ్… 2000 కోట్ల టార్గెట్??

పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…

8 hours ago

బాలయ్యకి జై లవకుశ చాలా ఇష్టం – బాబీ

ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…

8 hours ago

మనకి గేమ్ ఛేంజర్ ఉంది తాతయ్య : దిల్ రాజుకి మనవడి కాల్

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…

9 hours ago