Political News

పంక్చ‌ర్లు ప‌డుతున్నా.. ప‌ట్టించుకోరా? టీడీపీలో గుస‌గుస‌

ఔను! టీడీపీ సైకిల్‌కు పంక్చ‌ర్లు ప‌డుతున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో చాలా మంది నాయ‌కులు జంప్ చేశారు. ఆ త‌ర్వాత‌.. మ‌రికొంద‌రు వెళ్లాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు ఏదో చేస్తారు.. వేచి చూద్దాం.. అనే ధోర‌ణిని అవలంబించారు. కానీ, రెండేళ్లు గ‌డిచినా.. అసంతృప్త నేత‌ల‌ను చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ఈ క్ర‌మంలో ప‌లువ‌రు నేత‌లు.. ఆయ‌న‌కు విన్న‌పాలు చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో మ‌ళ్లీ జంపింగుల ప‌ర్వం తెర‌మీదికి వ‌చ్చింది. కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు కీల‌క నేత‌లు.. పార్టీకి రాం రాం చెప్పారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మ‌హిళా నేత‌, ఫైర్ బ్రాండ్ శోభా హైమావ‌తి.. టీడీపీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఇది మ‌రిచిపోక‌ముందే.. గుంటూరు జిల్లాలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న దివంగ‌త లాల్ జాన్ బాషా సోద‌రుడు జియావుద్దీన్‌.. జంప్ చేశారు. వీరిద్ద‌రూ కూడా పార్టీకి మంచి న‌మ్మ‌కస్తులుగా పేరున్న వారే.

పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే.. త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వీరిని ప‌ట్టించుకోలేదు. దీంతో గ‌డిచిన రెండేళ్లుగా వీరు చంద్ర‌బాబుకు త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు, పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాల‌ని విన్న‌వించుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ, చంద్ర‌బాబు వీరికి అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని.. పార్టీలో ఇప్పుడు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ప‌రంప‌ర ఇప్ప‌టితో పోద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నాయ‌కులు ప‌దుల సంఖ్య‌లో ఉన్నార‌ని.. వారిని ప‌ట్టించుకుని.. స‌ముచిత స్థానం క‌ల్పించ‌క‌పోతే.. పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

పోతే పోనీ.. మాది పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ.. ఎంత‌మందినైనా నేత‌ల‌ను త‌యారు చేసుకుంటాం! అనే ధీమా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొత్త నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేదెప్పుడు..? ఓటు బ్యాంకుగా మారేదెప్పుడు? అనే ప్ర‌శ్న‌ల‌కు టీడీపీలో స‌మాధానం ల‌భించ‌డం లేదు. మ‌రి ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు త‌న వ్యూహాన్ని మార్చుకుని.. నేత‌ల‌ను కాపాడుకుంటే.. మంచిదనే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on July 22, 2021 8:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

45 minutes ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

45 minutes ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

1 hour ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

3 hours ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

5 hours ago