ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో, ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలినట్లయింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంత ో ఆయనను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లిన వెంకటేశ్వరరావుకు నిరాశ ఎదురైంది. సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించడంతో ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏబీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.
మరోవైపు, డాక్టర్ సుధాకర్ పై పోలీసుల తీరుపై ప్రభుత్వంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేవని ప్రశ్నించినందునే సుధాకర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ క్రమంలొనే రోడ్డుపై డాక్టర్ సుధాకర్ తో పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింధి. అయితే, ఏపీ ప్రభుత్వం ఆ రంగులు తొలగించకుండా మరో రంగును అదనంగా వేసింది. దీంతో, ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశముంది.
This post was last modified on May 23, 2020 12:56 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…