ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఆశించిన విధంగా.. ఆయన పుంజుకోలేక పోతున్నారు. తన కోరిక ఏదీ కూడా నెరవేరడం లేదనే ఆవేదనతోనూ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రజాభిమానం ఉన్న సమయంలోనే గౌరవంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రిగా చేసిన ఆనం.. తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి జిల్లాలో చక్రం తిప్పారు.
అయితే.. రాష్ట్ర విభజనత ర్వాత.. కొన్నాళ్లకు టీడీపీలో చేరినా.. గత ఎన్నికల్లో టికెట్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. వైసీపీ చెంత చేరిపోయారు. ఈ క్రమంలోనే వెంకటగిరి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. తన సీనియార్టీకి గుర్తింపు వస్తుందని.. జగన్ కేబినెట్‌లో పోస్టు లభిస్తుందని ఆశించినా.. అది జరగలేదు.
పోనీ.. కీలకమైన పదవులు ఏవైనా కట్టబెడతారని.. పార్టీలోను, ప్రభుత్వంలోను గుర్తింపు వస్తుందని భావించారు. అయితే.. అది కూడా జరగలేదు. ఆనం చేసిన వ్యాఖ్యలతో జగన్‌కు, ఆయనకు గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఆయన ఎంతో ఇష్టంగా కోరుకుంటోన్న మంత్రి పదవి కూడా వచ్చే ఛాన్సులు లేవు. దీనికితోడు జిల్లా రాజకీయాల్లో ఆనం ప్రభ నానాటికి తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయనే భావన ఆనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారిపోతారనే వార్తలు ఇటీవల భారీగానే హల్‌చల్ చేశాయి. అయితే.. ఇప్పుడు టీడీపీకానీ, బీజేపీకానీ.. పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదన్నది ఆయన భావనగా ఉంది.
పైగా.. ఏ పార్టీలోకి వెళ్లినా.. ఆయనకు గుర్తింపు ఉంటుందనే నమ్మకమూ లేదని తెలుస్తోంది. దీంతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. ప్రజల్లో అభిమానం, ఆదరణ ఉన్న సమయంలోనే తప్పుకొంటే.. బాగుంటుందని.. భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. తన కుటుంబం నుంచి యువతను ప్రోత్సహించే విషయం మాత్రం ఆయన ఆలోచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 13, 2021 7:14 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…