ఈరోజుకు అయితే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయపార్టీ వైఎస్సార్టీపీపై ఎవరిలోను పెద్ద అంచనాలైతే లేవనే చెప్పాలి. ముందు ముందు సంగతి ఇపుడే చెప్పలేం. అయితే ఈ ఏడాడి చివరిలో రాష్ట్రంమొత్తం పాదయాత్ర చేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే, పాదయాత్ర మొదలైన తర్వాత కానీ షర్మిలతో చేతులు కలిపేదెవరో బయటకు తెలీదు.
ఇప్పటికైతే వైఎస్సీర్టీపీలో కన్నా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోనే గట్టి నేతలున్నారు. షర్మిల పార్టీపెట్టి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇఫ్పటికిప్పుడు గట్టి నేతలను ఆశించేందుకు లేదు. అయితే వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు పెద్దఎత్తున షర్మిలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జరిగిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పార్టీ ఆవిర్భావం రోజున ఎవరు ఎక్కడా కనబడలేదు.
ఇక అసలు విషయానికి వస్తే రేపటి ఎన్నికల్లోగా పార్టీలో గట్టి నేతలు చేరితే పార్టీ బలోపేతమవటం ఖాయం. లేకపోతే పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా మూడు పార్టీల్లోని అసంతృప్తుత నేతలే శరణ్యం అనే వాదన వినిపిస్తోంది. ఈ అసంతృప్త నేతల విషయం ఇప్పుడిప్పుడే తేలే అవకాశంలేదు. ఎన్నికల సంవత్సరంలో కానీ అసంతృప్త నేతలు తమ పార్టీల్లో నుండి బయటకు వచ్చే అవకాశంలేదు.
ఎన్నికలు దగ్గర పడేక్రమంలో టికెట్లు దక్కదని నిర్ధారించుకున్న వారు, టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకునే అవకాశం లేని పై పార్టీల నేతలకు షర్మిల పార్టీ ఆల్టర్నేటివ్ గా మారే అవకాశం ఉంది. వైఎస్సార్టీపీ ఎలాగైనా కొత్తపార్టీనే కాబట్టి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు దొరికే అవకాశం దాదాపు ఉండదు. అలాంటపుడు షర్మిలకు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలే అక్కరొకస్తారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 13, 2021 7:40 am
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో…
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం..…
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…