సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నివేదిక తప్పు దారి పట్టించేలా, నిజాలు దాచి రాసినట్టు అనిపిస్తోంది విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
డా.సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశించిన హైకోర్టు 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. మెజిస్ట్రేట్ నివేదికలు, ప్రభుత్వ నివేదికలు రెండూ తెప్పించుకున్నాం.
డా.సుధాకర్ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి పేర్కొనలేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని కోర్టు పేర్కొంది.
ప్రభుత్వ నివేదిక చూశాక దీని వెనుక భారీ కుట్ర ఉందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. గత మూడు రోజులుగా సుధాకర్ కేసును హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ కేసును సీరియస్ గా పరిగణిస్తూ వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా డాక్టర్లు ఫ్రంట్ లైన్ వారియర్లుగా కోవిడ్ నుంచి ప్రజలను రక్షిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు వైద్యుల మొరాలిటీని దెబ్బతీస్తాయని ఐఏంఏ వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పు రావడం గమనార్హం. హైకోర్టు నిర్ణయం ఏపీ సర్కారును షాక్ గురిచేసింది.
ఇదిలా ఉండగా… సుధాకర్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగం తిరిగిస్తాం, సైలెంటుగా ఉండండి అని ప్రభుత్వం లో కొందరి నుంచి ఫోన్లు వచ్చాయి. ఉద్యోగం కోసం మేమిప్పుడు వెనక్కు తగ్గితే కష్టకాలంలో మాకు అండగా నిలిచిన వారిని మేము అవమానించినట్టు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
This post was last modified on May 22, 2020 1:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…