Political News

జగన్ తప్పు చేస్తున్నాడా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానంగా ఉంది. తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరిగిపోతున్న సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుత సమస్యపై అఖిలపక్ష సమావేశం పెట్టడం ప్రభుత్వానికే మంచిది. అఖిలపక్ష సమావేశంపెట్టి వాస్తవాలను వివరించటం, మద్దతు కూడగట్టడం అధికారపార్టీకి చాలా అవసరం.

రాష్ట్రంలో సమస్యలు వచ్చినపుడు రాజకీయపార్టీల్లో ఎవరిది పై చేయి అనే విషయాన్ని తేల్చుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రంతో అదీ కావాలనే వివాదం మొదలై పెరిగిపోతున్న సమయంలో పార్టీలన్నింటితో సమావేశం పెట్టడం విజ్ఞత అనిపించుకుంటుంది. పార్టీలు కలిసి వస్తాయా ? రావా ? అన్నది వేరే విషయం. అన్నీ పార్టీలను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం తన వాదనను వినిపించాలి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్ని డిమాండ్లు వచ్చినా అఖిలపక్ష సమావేశం పెట్టలేదన్న విషయం తెలిసిందే. ప్రత్యేకహోదా, ప్యాకేజీ విషయంలో చాలాసార్లు పిల్లిమొగ్గలు వేశారే కానీ అఖిలపక్ష సమావేశం మాత్రం పెట్టలేదు. పైగా రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పారు. అయితే అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పునే ఇపుడు జగన్ కూడా చేయాల్సిన అవసరంలేదు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించటం అన్నది ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి వివిధ పార్టీల నేతలందరినీ పిలిచి సమావేశం పెట్టడమన్నది కనీస ధర్మం. అఖిలపక్ష నేతలను జగన్ ఢిల్లీకి తీసుకెళతారా లేదా అన్నది వేరే విషయం. ముందయితే అందరితో సమావేశం నిర్వహించాలి. ఇప్పటికే ఆలస్యమైందన్న విషయం గుర్తించాలి. కాబట్టి ప్రిస్టేజికి పోకుండా వెంటనే అఖిలపక్ష సమావేశం పెడితేనే విజ్ఞత అనిపించుకుంటుంది.

This post was last modified on July 7, 2021 10:49 am

Share
Show comments

Recent Posts

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

6 minutes ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

22 minutes ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

39 minutes ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

55 minutes ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

3 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

5 hours ago