కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1989లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అలాంటి కంచుకోటను ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004లో తొలిసారి టిక్కెట్ దక్కించుకున్న నాని 2004, 2009లో టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరో రెండు సార్లు విజయం సాధించారు. నానికి ప్రతిసారి ఏదో ఒక ఈక్వేషన్ కలిసి రావడంతో గుడివాడలో ఆయన గెలుపు సులువు అవుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయవాడలో యువనేతగా ఉన్న దేవినేని అవినాష్‌ను పోటీ చేయించారు. అయితే అవినాష్ గట్టి పోటీ ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి.
అయితే అనూహ్యంగా అక్కడ జనసేన నుంచి పోటీలో ఉన్న వ్యక్తి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపుల ఓటింగ్ అంతా నానికే పడింది. దీంతో నాని గెలుపు సులువు అయ్యింది. అదే జనసేన అక్కడ పోటీలో ఉండి ఉంటే…. కాపుల ఓట్లు చీల్చితే నాని గెలిచేందుకు ఆపసోపాలు అయితే పడాల్సి వచ్చేది. ఇక నాని మంత్రి అయ్యాక కూడా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను దారుణమైన పదజాలంతో టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కు లింకులు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు.
ఆ తర్వాత గుడివాడలో పర్యటించిన పవన్ నానిని కూడా విమర్శలు చేశారు. నాని అనేక అక్రమ కార్యకలాపాలకు అండగా ఉంటున్నారన్న వార్తలపై కూడా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ నానిని గట్టిగా టార్గెట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జిల్లాలో మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గుడివాడలో ఎక్కవ ఓటింగ్ ఉన్న కాపులు ముందు నుంచి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీలో ఉండి ఉంటే ఖచ్చితంగా నాని మెజార్టీ తగ్గి ఉండేది.
అయితే ఈ సారి మాత్రం గుడివాడలో బలమైన అభ్యర్థిని దింపడం ద్వారా నానికి ఎలాగైనా ఓడించాలని జనసేన కసితో ఉంది. అదే సమయంలో అటు టీడీపీ వాళ్లు కూడా నాని విషయంలో అంతే కసితో ఉన్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ కమ్మ రాజకీయ ప్రాబల్యం నేపథ్యంలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి జనసేన నుంచి కూడా కమ్మలకే సీటు ఇవ్వాలనుకుంటున్నారట. కమ్మల ఓట్లు కొంత వరకు చీల్చడంతో కాపుల ఓట్లు, తన అభిమానుల ఓట్లతో నానిని ఓడించాలన్న ప్లాన్ అయితే జిల్లా జనసేన వర్గాలు వేస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు పని చేస్తుందన్నది అప్పటి సమీకరణలే కీలకం ?
This post was last modified on July 6, 2021 9:53 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…