తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం.
ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, ఎన్టీఆర్ ని పువ్వాడ ఎందుకు కలిశారా అనే అనుమానాలు చాలా మందిలో కలిగే ఉంటాయి. అయితే.. దానికి రాజకీయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తన ట్వీట్ చూస్తే అర్థమౌతోంది.
మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తారక్ తో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడ దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.
కాగా.. పువ్వాడ తన కుమారుడు నయన్ ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికోసమే.. వీరిద్దరినీ కలిసారంటూ పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మంత్రి పువ్వాడ కుమారుడు నయన్.. ఈ ఇద్దరి నటులకు అభిమాని అయ్యి ఉండచ్చని.. అందుకే కలిశారు కాబోలు అంటున్నారు. ఏది ఏమైనా ఈయన ఇప్పుడిలా వారిని కలవడం.. హాట్ టాపిక్ గా మారగా.. ఫోటోలు వైరల్ గా మారాయి.
This post was last modified on July 5, 2021 2:22 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…