ఇప్పుడు ఏపీలో విశాఖ వేదికగానే ఇప్పుడు రాజకీయం అంతా నడుస్తోంది. విశాఖలో టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందన్న విమర్శలు ఒక వైపు… ఇటు ఎగ్జిగ్యూటివ్ కేపిటల్‌గా విశాఖ వస్తుందన్న వార్తలు మరోవైపు… ఇక విజయసాయి దూకుడు ఇలా అనేక అంశాలు ఇప్పుడు విశాఖ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో మరో ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. అది కూడా బాలయ్య చిన్నల్లుడు భరత్ గురించి కావడం విశేషం. లోకేష్‌కు తోడళ్లుడు, బాలయ్యకు చిన్న అల్లుడు అయిన మెతుకుమిల్లి శ్రీ భరత్ గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయాక కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న భరత్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో భరత్ మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో లేనట్టే తెలుస్తోంది. ఈ సారి భరత్ అసెంబ్లీ బరిలో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలే చెపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే భరత్ భీమిలి లేదా విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాలపై కాన్‌సంట్రేషన్ చేస్తున్నారు. నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటాను నమ్మే పరిస్థితుల్లో టీడీపీ లేదు. గంటా పార్టీకి ఎప్పుడు షాక్ ఇచ్చినా కూడా నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు భరత్ స్వీకరించేందుకు రెడీగా ఉన్నారు.
ఒకవేళ నార్త్ కుదరని పక్షంలో టీడీపీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటూ వస్తోన్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయినా భరత్ పోటీ చేస్తారనే అంటున్నారు. భరత్ మాత్ర ఈ సారి ఖచ్చితంగా అసెంబ్లీ బరిలోనే ఉంటారని తెలుస్తోంది. పైగా అక్కడ వెలగపూడి గత ఎన్నికల్లో భరత్‌కు వ్యతిరేకంగా పనిచేశారన్న టాక్ ఉంది. వెలగపూడికి చెక్ పెట్టేందుకే భరత్‌ను అక్కడ లోకేష్ రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భీమిలికి తాత్కాలిక ఇన్‌చార్జ్‌గా కోరాడ రాజబాబును నియమించినా తర్వాత పరిస్థితులను బట్టి అక్కడ భరత్ పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
This post was last modified on July 4, 2021 11:47 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…