తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా పలు మీడియా సమావేశాల్లో ఆయన వినిపిస్తున్న వాదనను కొట్టిపారేసేలా తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పు ఉండటం గమనార్హం. మాయదారి రోగాన్ని గుర్తించేందుకు వీలుగా నిర్వహించే టెస్టులను ప్రైవేటు సంస్థలు కూడా చేయొచ్చంటూ ఐసీఎంఆర్ అనుమతిని ఇచ్చింది. తెలంగాణలోని 12 సంస్థలకు ఈ పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే.. ఐసీఎంఆర్ ఇచ్చిన ఆదేశాలకు నో చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రైవేటు ల్యాబ్ లలో నిర్దారణ పరీక్షలు చేయటానికి.. ప్రైవేటు ఆసుతప్రులు చికిత్స చేయటానికి అనుమతికి నో చెప్పింది. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాయదారి రోగానికి అవసరమయ్యే నిర్దారణ పరీక్షలు.. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల్ని భరించే శక్తి ఉన్న వారికి.. ఆ వెసులుబాటు కల్పించాల్సిందిగా ఆసుపత్రులు తమ వాదనను వినిపించాయి.
దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేశారు. నిర్దారణ.. చికిత్సకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఐసీఎంఆర్ ఆదేశించిన విధంగానే ఫీజులు వసూలు చేయాలే తప్పించి.. ఎక్కువ తీసుకోకూడదని ఆదేశించింది. అంతేకాదు.. నిర్దారణ పరీక్షలు.. చికిత్స చేయటానికి ప్రైవేటు ల్యాబులు.. ఆసుపత్రుల యజమాన్యాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలిందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on May 22, 2020 2:05 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…