ఆ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కుటుంబ పెద్దతో పాటు పెళ్లై భార్యాపిల్లలున్న అతడి కుమారుడు కూడా మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కుటుంబ పెద్ద చనిపోయిన విషయం వారికి తెలిసినా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడి కుమారుడి మరణవార్త మాత్రం ఆ ఫ్యామిలీకి తెలియలేదు. ఈలోగా కుటుంబ పెద్దతో పాటు అతడి కుమారుడి మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిగిపోయాయి. ఈ తంతు తెలియని ఆ కుమారుడి భార్య… తన భర్త జాడ తెలియడం లేదంటూ ఫిర్యాదు చేసింది. నేరుగా మంత్రి కేటీఆర్ కు కూడా కంప్లైంట్ చేసింది. మొత్తంగా రెండో మరణానికి చెందిన సమాచారం ఆ కుటుంబానికి తెలియలేదు. ఈ సమాచారాన్ని ఆ కుటుంబానికి ఇవ్వకుండానే మృతుడి అంత్యక్రియలు ముగిసిపోయాయి. ఇది ఇప్పుడు తెలంగాణలో పెను వివాదంగానే మారిపోయింది. దీనిపై స్పందించిన మరో మంత్రి ఈటల రాజేందర్ అసలు విషయం ఇదంటూ స్పందించారు.
ఈ స్పందనలో ఈటల ఏమన్నారంటే… ‘‘వనస్థలిపురానికి చెందిన ఈశ్వరయ్య కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈశ్వరయ్య మృతి చెందారు. ఆయన కుమారుడు మధుసూదన్ అదే రోజు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 1న చనిపోయారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పాము. అయితే తన భర్త చనిపోయాడని భార్యకు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంలో ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అప్పటికే ఒకరిని కోల్పోయారు. మరొకరి మృతి గుచించి చెబితేతట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు కూడా చెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆస్పత్రిలోనే ఉండటంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు చేసింది. మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టే పరిస్థితి లేదు’’ అని ఈటల చెప్పుకొచ్చారు.
మొత్తంగా తన అనుమతి లేకుండా తన భర్త అంత్యక్రియలు ఎలా చేస్తారని మధుసూదన్ భార్య మాధవి ఆవేదన వ్యక్తం చేయడంలో అర్థం ఉన్నా… కరోనాతో మొత్తం ఫ్యామిలీ ఆస్పత్రిలో ఉండటం, అప్పటికే కుటుంబ పెద్దను కోల్పోయిన షాక్ లో మాధవి సహా ఇతర కుటుంబ సభ్యులు ఉండటం, ఈ క్రమంలో మధుసూదన్ చనిపోయిన విషయాన్ని మాధవికి తెలియకుండానే అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వ వాదన కూడా కరెక్టుగానే అనిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి కారణంగా భర్త చనిపోతే… భార్యకు తెలియకుండానే ఆ భర్త మృతదేహానికి అంత్యక్రియలు జరిగిపోవడం నిజంగానే ఆవేదనాభరితమే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో అంతకు మించిన మార్గాంతరం కూడా లేదన్న విషయాన్ని మాధవి కూడా అర్థం చేసుకోవాలన్న వాదన కూడా వినిపిస్తోంది.
This post was last modified on May 21, 2020 8:15 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…