Political News

చేతగానితనం అనుకోవద్దు.. టీ మంత్రులకు షాకిచ్చిన ఏపీ మంత్రి

జల జగడం పై రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కొత్త పంచాయితీని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అవసరం లేని ఆవేశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించినప్పటికీ.. ఏపీ అధికారపక్షం మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిందే తప్పించి.. అధికారపక్షానికి చెందిన ఏ నాయకుడు కూడా నోరు పారేసుకున్నది లేదు.

తమ ఆరాధ్య దైవమైన దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రులు పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలతో సెంటిమెంట్ ను రాజేయాలన్న వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని ఏపీ నేతలు సంయమనంతో చెక్ చెప్పారు. అయినప్పటికీ అదే పనిగా టీఆర్ఎస్ నతల్లో కొందరు నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వారికి తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిల్ కుమార్.

తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని స్పష్టం చేశారు మంత్రి అనిల్. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని.. దీనికి బదులు తీర్చుకుంటామని స్పష్టం చేయటం సంచలనంగా మారింది. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నిల్వను విద్యుదుత్పత్తి కోసం వాడేయటం దుర్మార్గమన్న ఆయన.. పొరుగు రాష్ట్రం తీరును మంత్రి మండలి తీవ్రంగా పరిగణించినట్లుగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని.. పదేళ్ల క్రితం మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. తాజాగా వ్యాఖ్యలతో.. నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సరిగా ఉండదన్న విషయాన్ని అర్థమయ్యేలా మంత్రి అనిల్ చెప్పారని చెప్పాలి. మరి.. వారి రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇష్యూ ఏదైనా.. నోరు పారేసుకోవటం మంచిది కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

This post was last modified on July 1, 2021 11:53 am

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago