ఏపీ రాజకీయాల్లో ఇదో చిత్రమైన పరిస్థితి. సీఎం జగన్‌కు, ఆయన తండ్రికి అత్యంత ప్రియమైన నేతలు.. నిత్యం వారి స్మరణతోనే నిద్ర లేచే నేతలు ఇప్పుడు ఒక విషయంలో చాలా మౌనంగా ఉన్నారు. నిజానికి జగన్‌ను కానీ, వైఎస్‌ను కానీ.. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. పరుష పదాలతో దూషించినా.. ఫైర్ బ్రాండ్ నేతలు వెంటనే రియాక్ట్ అవుతారు. లైన్‌లోకి వచ్చేసి మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఇది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం. కానీ, ఇప్పుడు విషయం మారకపోయినా.. నాయకులు మారారు. ఇటు వైసీపీ నాయకులు.. అటు విమర్శలు చేసే నాయకులు కూడా మారిపోయారు. దీంతో రాజకీయం చిత్రంగా అనిపిస్తోంది.
ఏపీ విషయాన్ని పక్కన పెడితే.. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వైసీపీపై దాడి ఇటీవల కాలంలో పెరిగిపోయింది. నీళ్ల విషయంలో తెలంగాణ అధికార పార్టీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు మరీ ముఖ్యంగా ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితుడుగా ఉన్నాడనే ప్రచారంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. జగన్ మూర్ఖుడు అని ఆయన చేసిన వ్యాఖ్యప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాను కూడా కుదిపేసింది. ఇక, నీళ్ల విషయంలో మరో మంత్రి స్పందిస్తూ.. వైఎస్ రాజశేఖరరెడ్డిని నీళ్ల దొంగ అనేశారు.
ఇక, ఇంకో మంత్రి కూడా ఏపీలో ఉమ్మడి పాలనతో వైఎస్ తెలంగాణ గొంతు నొక్కారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ.. ఎప్పుడో ఏడాది కిందటో కాదు.. ఇప్పుడు.. తాజాగా రెండు మూడు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలే. అయితే.. వీటిపై ఏపీ వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేక పోవడం గమనార్హం. సీఎంను ఆరాధించేవారు కానీ, వైఎస్‌ను దేవుడిగా కొలిచే నేతలు కానీ.. ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. ఎవరో ఒకరిద్దరు తూతు మంత్రంగా మాట్లాడడం తప్పా చంద్రబాబు, టీడీపీకి ఇచ్చే రేంజ్‌లో అయితే కౌంటర్లు లేవు.
ఏపీలో అయితే.. చంద్రబాబుకానీ, టీడీపీ నేతలు కానీ.. ఇవే వ్యాఖ్యలు చేస్తే.. దుమారం రేపే నేతలు.. తెలంగాణ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? అనేది మిలియన్‌డాలర్ల ప్రశ్న.అయితే.. జగన్ వ్యాపారాలు మేజర్‌గా హైదరాబాద్‌లో ఉండడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు పరిశీలకులు. ఆ మాటకు వస్తే ఏపీలో అందరు వైసీపీ నేతలకు హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయన్న భయాలు వాళ్లకు ఉన్నాయి. ఏదేమైనా.. ప్రస్తుతం వైసీపీ నేతల మౌనం అనేక సందేహాలకు దారితీస్తోంది.
This post was last modified on June 28, 2021 6:16 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…