జగన్ సార్.. వన్ మినిట్.. మాకు గుర్తింపు ఎప్పుడు?.. మమ్మల్ని పట్టించుకునేదెప్పుడు ? ఇదీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు.. ఎంపీలు అడుగుతున్న ప్రశ్న. దీనికి ప్రధాన కారణం జగన్ తీసుకున్న కీలక నిర్ణయమే. ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య ప్రజాప్రతి నిధులే కీలకం. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమానికి, ప్రతి సంక్షేమ పథకానికి ప్రజా ప్రతినిధులు కీలకం. వీరే ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లేవారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జగన్ తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు-ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెంచేసింది.
ఏ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినా.. ఏపథకం అమలు చేసినా.. ప్రజలకు-ప్రబుత్వానికి మధ్య వలంటీర్లే కీలకంగా మారారు. దీంతో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం తగ్గిందనేది వాస్తవం. ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకురా వడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా? అనేది ప్రశ్న. ఇదే విషయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాపోతున్నారు.
“ఒకప్పుడు.. ప్రజలు ఎమ్మెల్యేల కోసం క్యూ కట్టుకుని ముందుకు వచ్చేవారు. తమ సమస్యల పరిష్కారం కోసం.. మమ్మల్ని సంప్రదించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మేమంటే.. లెక్కేలేదు. మమ్మల్ని పట్టించుకునేవారు లేరు” ఇదీ.. ఎమ్మెల్యేలు ఒకరికొకరు చేస్తున్న గుసగుస..!
వాస్తవానికి వలంటీర్ వ్యవస్థతో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరే! పోనీ.. అదే సమయంలో వారు.. తమ నియోజకవర్గం నిధులు అయినా.. ఇవ్వమని కోరుతున్నారు. ఎందుకంటే.. ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వలంటీర్లు ఉన్నా.. కీలకమైన కాంట్రాక్టులు, పనులు, నియోజకవర్గం అభివృద్ది విషయంలో మాత్రం.. ఎమ్మెల్యేలదే కీలక పాత్ర.
ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నిధులు అందితే.. పనులు చేసేందుకురెడీ అవుతున్నారు. కానీ, రెండేళ్లు గడిచినప్పటికీ.. ఇప్పటి వరకు నిధులు లేవు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇలా.. అటు వలంటీర్లు.. ఇటు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వంటి రీజన్లతో ఎమ్మెల్యేలు.. వాపోతున్నారు. సార్ మమ్మల్ని కూడా పట్టించుకోండి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి జగన్ ఇప్పటికైనా ఎమ్మెల్యేల గురించి పట్టించుకుంటారో లేదో చూడాలి.
This post was last modified on June 28, 2021 6:13 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…