కరోనా మహమ్మారి అంతమొందించేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా మహమ్మారిని తరమికొట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో.. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
అయితే.. ప్రస్తుతం మన దేశంలో కోవీషీల్డ్, కో వ్యాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. కాగా.. వ్యాక్సిన్లలో ఒకటైన కోవీషీల్డ్ పై యూరప్ కంట్రీలు ఆంక్షలు విధిస్తున్నాయి. కోవీషీల్డ్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించమని తేల్చి చెబుతున్నాయి.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు యూరోప్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యురోపియన్ దేశాల సమాఖ్య నుండి ఇంకా కోవిషీల్డ్ కు అనుమతి రాలేదు. దీంతో కోవిషీల్డ్ తీసుకొని ఈయూ కంట్రీస్ కు వెళ్లేవారికి ఆ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
కాగా.. ఈ విషయంపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. వీరి గురించి ఆయా దేశాల అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ ఔషధ నియంత్రణాధికారులతో పాటు, దౌత్యపరమైన రీతిలోనూ ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు సీరం సీఈవో తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ యూరప్‌లో వాక్స్‌జెవ్రియా పేరుతో కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాతో పాటు ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే టీకాలకు మాత్రమే ఈయూలో గుర్తింపు ఉంది.
This post was last modified on June 28, 2021 6:06 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…