Political News

జగన్‌పై ఆర్కే సంచలన పలుకు

ప్రతి శనివారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో.. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ‘కొత్త పలుకు’ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సమకాలీన రాజకీయాలపై విశ్లేషణతో ఈ వ్యాసం రాస్తుంటారు. అందులో అంశాలు సంచలనాత్మకంగా ఉండేలా చూసుకుంటారాయన. బడా రాజకీయ నాయకులకు సంబంధించి లోగుట్టులన్నీ తనకు బాగా తెలిసినట్లుగా ఆయన ఇందులో వ్యాఖ్యానాలు చేస్తుంటారు.

ముఖ్యంగా తనకు బద్ధ శత్రుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి వారం ఏదో ఒక సంచలన విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఆర్కే. అందులో కొన్ని వాస్తవికంగా అనిపిస్తాయి.. కొన్ని అతిశయోక్తుల్లా కనిపిస్తాయి. ఈ వారం కొంచెం అతిగా అనిపించడమే కాక.. అందరూ నోరెళ్లబెట్టేలా ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించారు.

వైఎస్ జగన్ క్రిస్టియన్ అని, ఏసు ప్రభువును కొలుస్తారని అందరికీ తెలుసు. ఐతే జగన్ ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు జీసస్‌తో మాట్లాడతానని అందరితో చెప్పుకుంటారంటూ జగన్ ఈ వారం ‘కొత్త పలుకు’లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్కే.

గత ఏడాది కరోనా వచ్చిన కొత్తలో అధికారులు వైరస్ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేస్తే.. జగన్ తేలిగ్గా కొట్టిపారేశారని.. తాను అర్ధరాత్రి జీసస్‌తో మాట్లాడానని.. వైరస్ లాంటిదేమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేశారని.. దీంతో అధికారులకు ఏం మాట్లాడాలో పాలుపోలేదని ఆర్కే పేర్కొన్నారు. అలాగే గతంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తర్వాత వైకాపాలో చేరుదామని జగన్‌ను కలిశారని.. ఐతే తాను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రోజూ రాత్రి పూట మాట్లాడతానని జగన్ తన దగ్గర అనడంతో సదరు అధికారి అయోమయానికి గురై ఆ పార్టీలో చేరకుండా ఆగిపోయారని ఆర్కే అన్నారు. జగన్ మానసిక జబ్బుతో బాధపడుతున్నాడన్న తరహాలో ఆర్కే ఈ వారం ‘కొత్తపలుకు’ రాశారు. ఐతే దీనిపై జగన్ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా.. ఆయన ప్రత్యర్థులు సంబంధిత కామెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

This post was last modified on June 27, 2021 3:15 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago